Rakhi Sawant Husband Adil Khan Durrani Arrested - Sakshi
Sakshi News home page

Rakhi Sawant: భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి..!

Published Tue, Feb 7 2023 6:49 PM | Last Updated on Tue, Feb 7 2023 7:05 PM

Rakhi Sawant Husband Adil Khan Durrani Arrested - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, బాలీవుడ్ నటి రాఖీసావంత్‌ పెళ్లి అచ్చం సినిమాలాగే రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు ఆదిల్ దురానీతో పెళ్లయినట్లు ప్రకటించాక టన్నుల కొద్ది ట్విస్టులు బయటకొస్తున్నాయి. ఇటీవలే మరో అమ్మాయితో ఆమె ప్రియునికి సంబంధాలు ఉ‍న్నాయని రాఖీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా రాఖీ సావంత్ అతనిపై ముంబయి పోలీసులను ఆశ్రయించింది. ఓషివారా పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఆదిల్ తనను మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసింది రాఖీ సావంత్.  ఆదిల్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టును మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. అయితే రాఖీ సావంత్ మాత్రం ఆదిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని మీడియాకు తెలిపింది. 

రాఖీ సావంత్ మాట్లాడుతూ..'ఆదిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశా. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా నాటకం కాదు. అతను నా జీవితాన్ని నాశనం చేశాడు. అతను నన్ను కొట్టి నా వద్ద డబ్బు తీసుకున్నాడు. నిన్నెవరు నమ్ముతారని కొట్టేవాడు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి. తన తల్లి మరణానికి కూడా ఆదిల్ కారణం.'అంటూ ఆరోపించింది.  కాగా.. రాఖీ సావంత్, ఆదిల్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో తన పెళ్లిని అఫీషియల్‌గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతేడాది జూలైలోనే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement