నాడు నగ్న సెల్ఫీ.. నేడు నన్ అవతారం!
బిగ్ బాస్ 7 సిరీస్‌లో పాల్గొన్న సోఫియా హయత్ గుర్తుందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరైన ఈ టాప్ మోడల్.. ఇప్పుడు నన్‌గా మారిపోయింది. ఒకప్పటి హొయలు, అందచందాలు అన్నింటినీ పక్కన పెట్టేసి తన అసలైన రూపం ఇదీ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జనం ముందుకు వచ్చింది. అప్పట్లో అర్మాన్ కోహ్లీతో గొడవ పెట్టుకున్న కారణంగా బిగ్ బాస్ 7 నుంచి మధ్యలోనే ఈ అమ్మడిని పంపేశారు.
2012లో ఈమె మాజీ బోయ్‌ఫ్రెండు రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు అతడికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన ఘనత కూడా ఈ బ్రిటిష్ మోడల్‌కు ఉంది. అప్పుడు అలా చేసినా, ఇప్పుడు నన్‌గా మారినా.. సోఫియా హయత్ ఏం చేసినా ఓ సంచలనంగానే ఉంటోంది. ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయానని, తనను గయా సోఫియా మదర్ అని పిలవాలని చెబుతోంది. ఏంటి నమ్మకం కుదరడం లేదా.. ఫొటోలు చూసి చెప్పండి