British model
-
సెల్ఫీ కోసం ప్రముఖ మోడల్ బలి
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన ప్రముఖ వర్ధమాన మోడల్, 21 ఏళ్ల మోడలిన్ డేవిస్ తన మిత్రులతో కలిసి సెల్ఫీలకు ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియాలోని ‘డైమండ్ బే రిజర్వ్’ పర్వతాలపైకి వెళ్లారు. సూర్యోదయానికి కూడా అది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాంతం. దాంతో వంద అడుగుల ఎత్తున్న పర్వత శిఖరం ఎక్కి ఆమె సెల్ఫీ తీసుకుంటుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి పక్కనున్న సముద్రంలో పడిపోయి ప్రాణాలు విడిచారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం పట్ల సోమవారం సోషల్ మీడియాలో నివాళులు వెల్లువెత్తుతున్నాయి. ఆమె మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం ధ్రువీకరించడంతో రెండు దేశాల సోషల్ మీడియాలో ఆమె గురించే ఎక్కువ ప్రస్తావన ఉంది. ‘బ్యూటీఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్‌సైడ్’ అంటూ ఆమెను పలువురు వ్యాఖ్యానించి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. ప్రపంచ పర్యటన పట్ల ఎంతో మక్కువ చూపించే డేవిస్ ఏడుగురు ‘బ్యాక్‌ప్యాకర్’ మిత్రులతో కలిసి ఆస్ట్రేలియా వచ్చారు. వారంతా వాక్లూజ్‌లో శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. అక్కడికి సమీపంలోని ‘డైమండ్ బే పర్వతం’ శిఖరాల మీదకు ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో చేరుకున్నారు. అప్పుడే ఉదయిస్తున్న లేత కిరణాల మసక వెళుతురులో శిఖరాగ్రం చివరన సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో పక్కనున్న సముద్రంలో పడిపోయారు. హెలికాప్టర్ ద్వారా ఆదివారం వెతికించగా ఆమె మృతదేహం దొరికింది. గత ఆగస్టు నెలలో కూడా ఓ 27 ఏళ్ల యువతి సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదవశాత్తు మరణించారు. -
ఫేస్బుక్లో లైకులు.. ప్రముఖ మోడల్ అరెస్టు!
లండన్: ప్రముఖ మోడల్‌కు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టు వెలుగుచూడటం బ్రిటన్‌లో కలకలం రేపుతోంది. గతంలో 'ద సన్' పత్రికకు అర్ధనగ్నంగా పోజిచ్చిన మోడల్ కింబర్లీ మినెర్స్ను లండన్ పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు. మినెర్స్ రహస్యంగా ఇస్లాం మతంలోకి మారి.. సోషల్ మీడియాలో ఐఎస్ఐఎస్ వీడియోలను లైక్ చేయడం, షేర్ చేయడం చేస్తున్నదని బ్రిటన్ యాంటీ టెర్రరిస్టు పోలీసులు గుర్తించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసుల ఉగ్రవాద నిరోధక చట్టం-2000 కింద ఆమెను గత శుక్రవారం అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదల అయిందని 'ద సండే టైమ్స్' పత్రిక తెలిపింది. 'ద సండే టైమ్స్' కథనం ప్రకారం.. 27 ఏళ్ల మినెర్స్ ఫేస్బుక్లో ఆయిషా లారెన్ ఆల్ బ్రిటానియా పేరిట ఖాతా తెరిచి.. ఐఎస్ఐఎస్కు అనుకూలంగా పోస్టులు పెడుతున్నది. ఐఎస్ఐఎస్ వీడియోలు, తుపాకులు పట్టుకున్న ముస్లిం మహిళల ఫొటోలు షేర్ చేయడమే కాకుండా.. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్న బ్రిటన్ సంతతి ఫైటర్‌తో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నదని పోలీసులు గుర్తించారు. దీని గురించి గతంలో పలుసార్లు హెచ్చరించిన అధికారులు తాజాగా ఆమెను అదుపులోకి తీసుకున్నారని, ఆమె ఇంట్లో కూడా సోదాలు జరిపారని ఆ పత్రిక తెలిపింది. అయితే, తన పేరిట నకిలీ ఖాతా తెరిచి ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. -
మేకప్ తో కనిపిస్తే నన్ను క్షమించండీ..!
బిగ్ బాస్ 7 సిరీస్ అనగానే మొదట గుర్తుకొచ్చే పేరు సోఫియా హయత్. ఎందుకంటే వైల్డ్ కాల్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరైన అప్పటి టాప్ మోడల్.. అర్మాన్ కోహ్లీతో గొడవ వల్ల ఆమెను సిరీస్ మధ్యలోనే ఇంటికి పంపివేసిన విషయం తెలిసిందే. సింగర్, మోడల్ అయిన సోఫియా ఇటీవల నన్(సన్యాసిని) గా మారినట్లు ప్రకటించింది. అయితే కొన్ని వారాలుగా ఆమె మేకప్ వాడుతోందని, అందానికే ఇంకా ప్రాధాన్యం ఇస్తున్నదంటూ విమర్శులు వెల్లువెత్తాయి. 'మేం మేకప్ లేకున్నా చాలా అందంగా ఉంటాం. హెయిర్ కలర్, ఫ్యాషన్ ఫాలోయింగ్ లేకున్నా సరే' అందంగానే కనిపిస్తామంటోంది. నన్ గా మారిన తర్వాత ఎవరైనా తనను మేకప్ లో చూసినట్లుగా భావిస్తే ఉంటే దయచేసి నన్ను క్షమించండి అంటూ బహిరంగంగా ప్రకటించింది. అప్పటి జీవితం వేరు.. ఇప్పటి లైఫ్ వేరని, గతంలో తాను చేయించుకున్న సర్జరీల వల్లే ఇంకా అందంగా కనిపిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు పెళ్లి చేసుకోవాలని, శృంగారంలో పాల్గొనాలనే ఆలోచనలు రావని అంటోంది. ఇకనుంచీ తాను తన పిల్లల కోసం బతుకుతానని, ప్రపంచం అంతటికీ తల్లినవుతానని చెప్పింది. ప్రేమించడం తప్పుకాదని, ప్రతి ఒక్కరూ ప్రేమ పొందగలగాలని ఆమె అభిప్రాయపడింది. గతంలో క్రికెటర్, మాజీ బాయ్ ఫ్రెండ్ రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు అతడికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయానని గతంలో చేసిన తప్పులు మళ్లీ చేసేందుకు సిద్ధంగా లేనని సోఫియా వివరించింది. -
నాడు నగ్న సెల్ఫీ.. నేడు నన్ అవతారం!
బిగ్ బాస్ 7 సిరీస్‌లో పాల్గొన్న సోఫియా హయత్ గుర్తుందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరైన ఈ టాప్ మోడల్.. ఇప్పుడు నన్‌గా మారిపోయింది. ఒకప్పటి హొయలు, అందచందాలు అన్నింటినీ పక్కన పెట్టేసి తన అసలైన రూపం ఇదీ అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా జనం ముందుకు వచ్చింది. అప్పట్లో అర్మాన్ కోహ్లీతో గొడవ పెట్టుకున్న కారణంగా బిగ్ బాస్ 7 నుంచి మధ్యలోనే ఈ అమ్మడిని పంపేశారు. 2012లో ఈమె మాజీ బోయ్‌ఫ్రెండు రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు అతడికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన ఘనత కూడా ఈ బ్రిటిష్ మోడల్‌కు ఉంది. అప్పుడు అలా చేసినా, ఇప్పుడు నన్‌గా మారినా.. సోఫియా హయత్ ఏం చేసినా ఓ సంచలనంగానే ఉంటోంది. ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయానని, తనను గయా సోఫియా మదర్ అని పిలవాలని చెబుతోంది. ఏంటి నమ్మకం కుదరడం లేదా.. ఫొటోలు చూసి చెప్పండి -
ప్రేమలో మళ్లీ..మళ్లీ..
చెన్నై : ప్రేమ గుడ్డిదంటారు. మరి కొందరు చెడ్డదంటారు. ఇంకొదరు పవిత్రమైనదంటారు. ఎవరేమన్నా ఒక సారి అయినా ప్రేమలో పడని వారుండరు. కొందరయితే ఈ ప్రేమ మైకంలో మళ్లీమళ్లీ పడుతుంటారు. హీరోయిన్ల విషయానికివస్తే నటి నయనతార ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో విఫలమై తాజాగా మూడోసారి యువ దర్శకుడు విఘ్నేశ్ శివలో పడ్డట్టు కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. వాళ్లు ఇప్పటికే రహస్య వివాహంతో ఒకటయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటి ప్రేమలో చిక్కుకున్న హీరోయిన్లలో మరో క్రేజీ నటి ఎమీ జాక్సన్. మదరాసు పట్టణం ద్వారా తమిళ చిత్రపరిశ్రమకు దిగుమతి అయిన ఈ ఇంగ్లిష్ బ్యూటీ ఇక్కడే సెటిల్ అయిపోయింది. తొలి చిత్రం విజయం సాధించినా ఆ తరువాత నటించిన తాండవం, విన్నైతాండివరువాయా హిందీ రీమేక్ ఏక్ దీవానా తా చిత్రాలు అపజయం చెందడంతో ఎమీ ఇక మూటాముల్లు సర్దుకోవలసిందే అనుకున్నారు. సరిగ్గా అలాంటి తరుణంలో స్టార్ దర్శకుడు శంకర్ నుంచి పిలుపొచ్చింది. ఆయన ఐ చిత్రంలో విక్రమ్‌తో చేసిన రొమాన్స్, ఆరబోసిన అందాలు సినీ ప్రేక్షకుల మతులు పోగొట్టాయి. ఎమీకి అవకాశలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఉదయనిధిస్టాలిన్‌తో గెత్తు, ధనుష్‌కు జంటగా తంగమగన్, విజయ్ 59వ చిత్రం అంటూ మూడు చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాదు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఎందిరన్-2 నటించే అవకాశం కొట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. కాగా ఏక్ దీవానా తా చిత్రం ప్లాప్ అవడంతో అక్కడ పాగా వేయాలనే ఆశలు ముగ్గయి పోయాయని భావించిన ఎమీజాక్సన్‌కు తాజాగా అక్కడ ఆశలు చిగురిస్తున్నాయట. ఇక ఏక్ దీవానా తా చిత్రం సమయంలో ఆ చిత్ర హీరో ప్రతీక్ బాబ్బార్తో ప్రేమలో మునిగితేలింది. అయితే అది కొంత కాలమే సాగింది. ఆ ప్రేమ బ్రేక్ అప్ అవడంతో అమ్మడు కొంత కాలం లండన్ బాయ్‌ఫ్రెండ్‌తో చట్టాపట్టాల్ అంటూ తిరిగేసిందని ప్రచారం జోరుగా సాగింది. ఆ బాయ్‌ఫ్రెండ్‌తోనూ తెగతెంపులు చేసుకున్న ఎమీ ఇప్పుడు ముంబాయికి చెందిన ఒక వ్యక్తి ప్రేమలో పడిందట. ఈ వ్యవహారం మీడియాలో హల్చల్ చేస్తున్నా ఆ అమ్మడు మాత్రం ఏలాంటి ఖండనా చేయలేదు. ఇలాంటి ప్రచారాన్ని ఈ అమ్మడు ఎంజాయ్ చేస్తుందేమో. -
నవ్వుల పాలైన నాలుగేళ్ల డిగ్రీ
1943 సంవత్సరం నుంచి మూడేళ్ల డిగ్రీ విధానమే కొనసాగుతోంది. ఈ కోర్సును నాలుగేళ్లకు పెంచి ‘బ్రిటిష్ మోడల్’ తీసుకురావాలని 2013 విద్యా సంవత్సరంలోనే వీసీ దినేశ్‌సింగ్ తలపెట్టారు. డిగ్రీ కోర్సును నాలుగు సంవత్సరాల కోర్సుగా ‘సంస్కరించడానికి’ జరిగిన తొలి ప్రయత్నం ఇదే. ‘స్పర్ధయా వర్థతే విద్య’ అంటారు. పోటీతో విద్య వర్ధిల్లుతుందన్న ఆ నానుడి సదా సంస్కృత శ్లోకాలతో, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలతో తన ఉపన్యాసాలని అలంకరించే ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) వైస్ చాన్సలర్ (వీసీ) దినేశ్‌సింగ్ తెలిసే ఉండాలి. కానీ ఆయన ఏం అర్థం చేసుకున్నారో గానీ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఎన్‌యూను అధికార రాజకీయాల పోటా పోటీ వేదికగా మార్చడానికి దోహదపడ్డారనే అనిపిస్తుంది. ఆ విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న మూడేళ్ల వ్యవధి కలిగిన అన్ని డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల కోర్సులుగా మార్చాలన్న నిర్ణయం నవ్వుల పాలయింది. విద్యార్థులు చదువులలో పోటీ పడే అవకాశమే లేకుండా, ప్రవేశాలకు ఈ అంశం పెద్ద అంతరాయంగా మారిపోయింది. దేశంలో 1943 సంవత్సరం నుంచి మూడేళ్ల డిగ్రీ విధాన మే కొనసాగుతోంది. ఈ కోర్సును నాలుగేళ్లకు పెంచి ‘బ్రిటిష్ మోడల్’ తీసుకురావాలని 2013 విద్యా సంవత్సరంలోనే వీసీ దినేశ్‌సింగ్ తలపెట్టారు. డిగ్రీ కోర్సును నాలుగు సంవత్సరాల కోర్సుగా ‘సంస్కరించడానికి’ దేశం మొత్తం మీద జరిగిన తొలి ప్రయత్నం ఇదే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాలుగేళ్ల డిగ్రీ కోర్సుకు సమాంతరంగా ఇక్కడ కూడా నాలుగేళ్ల పరిధిలోకి డిగ్రీ కోర్సులను తీసుకురావాలన్నది దీని వెనుక ఉన్న ఉద్దేశం. అప్పుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన సిబల్ సలహాతో దినేశ్‌సింగ్ ఈ ‘సంస్కరణ’కు శ్రీకారం చుట్టా రు. నిరుడు జరిగిన ప్రవేశాలు ఆ ప్రాతిపదికనే జరిగాయి. అప్ప టి నుంచి దీని మీద వివాదం సాగుతూనే ఉంది. కానీ ప్రభుత్వం మారిపోవడంతో డీయూకు ఇక్కట్లు ముదిరాయి. నిజానికి డిగ్రీ కాల పరిధిని నాలుగేళ్లు చేయడం మీద విశ్వ విద్యాలయ ప్రాంగణంలోనే ఏకాభిప్రాయం లేదు. ఇది 60,000 మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. బీజేపీ, ఆమ్ ఆద్మీ నాలుగేళ్ల వ్యవధికి వ్యతిరేకం. తాము అధికారానికి వస్తే నాలుగేళ్ల కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చడం తథ్యమని బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రకటించింది కూడా. డీయూ పరిధిలో ఉన్న 64 కళాశాలల మధ్య కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయం లేదు. అయితే జూన్ 24న నాలుగేళ్ల కోర్సును మూడేళ్ల కోర్సుగా మార్చవలసిందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా మార్చడం విద్యా విధానానికే విరుద్ధమని యూజీసీ వాదించింది. అయితే ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపక సంఘం నాలుగేళ్ల కోర్సుకు అనుకూలం. ఎంతో పటిష్టంగా ఉండే ఢిల్లీ విశ్వ విద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) యూజీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ విషయం మీద పూర్తి స్పష్టత వచ్చే వరకు కొత్త ప్రవేశాలు నిలిపివేయాలనే డ్యూటా ప్రస్తుత అధ్యక్షురాలు నందితా నారాయణ్ కోరుతున్నారు. యూజీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ విద్యాలయం అధ్యాపకులు పార్లమెంటు భవనం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖాళీగా ఉన్న నాలుగు వేల అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేయకుండా, ఇలాంటి నిర్ణయాలతో ప్రభుత్వం విశ్వవిద్యా లయం స్వయం ప్రతిపత్తిని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న దని డ్యూటా ఆరోపిస్తున్నది. 54,000 సీట్ల భర్తీకి ఇప్పటికే 2,70,000 దరఖాస్తులు పెట్టుకున్న విద్యార్థులు ఈ పరిణామాలతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సును తిరిగి మూడేళ్లకు తగ్గించాలని యూజీసీ ఇచ్చిన ఆదేశాల మీద డ్యూటా మాజీ అధ్యక్షుడు ఆదిత్య నారాయణ్ మిశ్రా ఢిల్లీ సుప్రీం కోర్టులో సవాలు చేశారు. అయితే కోర్టు కలుగ చేసుకోవడానికి అంగీకరించలేదు. కాగా, ఈ అంశం యూజీసీకీ, విశ్వ విద్యాలయానికి మధ్య వివాదమని, తనకు సంబంధం లేదని మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానీ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎప్పుడూ నాలుగేళ్ల వ్యవధి కోర్సుగానే ఉన్న బీటెక్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరి కోర్సు వ్యవధిని మూడేళ్లు చేస్తే రాబోయే పరిణా మాలు తీవ్రంగానే ఉంటాయి. అధ్యాపకులు, కేంద్రం లేదా యూజీసీ, విద్యార్థులు ఎవరి దారి వారిది అన్న రీతిలో ఈ అంశం మీద తమ తమ వైఖరిని కనబరుస్తున్నారు. యూజీసీ ఆదేశాలు రాగానే వీసీ దినేశ్ సింగ్ వెంటనే వాటిని శిరసావహిస్తున్నట్టు ప్రకటించారు. డీయూ పరిధిలోని 64 కళాశాలల్లో 57 వరకు మూడేళ్ల డిగ్రీని తిరిగి ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలియచేశాయని యూజీసీ వెంటనే ప్రకటించడం విశేషం. బీజేపీ, దాని విద్యార్థి విభాగం ఏబీవీపీ, ఆప్ యూజీసీ నిర్ణయాన్ని స్వాగతించగా, కాంగ్రెస్ తొందరపా టు చర్యగా భావిస్తోంది. ఇవన్నీ చూస్తే ఒక పెద్ద విద్యా పీఠాన్ని మన రాజకీయులు నవ్వుల పాలు చేశారని చెప్పక తప్పదు. - కల్హణ