ప్రేమలో మళ్లీ..మళ్లీ.. | amy jackson in love | Sakshi
Sakshi News home page

ప్రేమలో మళ్లీ..మళ్లీ..

Published Sun, Nov 1 2015 8:06 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

ప్రేమలో మళ్లీ..మళ్లీ.. - Sakshi

ప్రేమలో మళ్లీ..మళ్లీ..

చెన్నై : ప్రేమ గుడ్డిదంటారు. మరి కొందరు చెడ్డదంటారు. ఇంకొదరు పవిత్రమైనదంటారు. ఎవరేమన్నా ఒక సారి అయినా ప్రేమలో పడని వారుండరు. కొందరయితే ఈ ప్రేమ మైకంలో మళ్లీమళ్లీ పడుతుంటారు. హీరోయిన్ల విషయానికివస్తే నటి నయనతార ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో విఫలమై తాజాగా మూడోసారి యువ దర్శకుడు విఘ్నేశ్ శివలో పడ్డట్టు కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.

వాళ్లు ఇప్పటికే రహస్య వివాహంతో ఒకటయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటి ప్రేమలో చిక్కుకున్న హీరోయిన్లలో మరో క్రేజీ నటి ఎమీ జాక్సన్. మదరాసు పట్టణం ద్వారా తమిళ చిత్రపరిశ్రమకు దిగుమతి అయిన ఈ ఇంగ్లిష్ బ్యూటీ ఇక్కడే సెటిల్ అయిపోయింది. తొలి చిత్రం విజయం సాధించినా ఆ తరువాత నటించిన తాండవం, విన్నైతాండివరువాయా హిందీ రీమేక్ ఏక్ దీవానా తా చిత్రాలు అపజయం చెందడంతో ఎమీ ఇక మూటాముల్లు సర్దుకోవలసిందే అనుకున్నారు.

సరిగ్గా అలాంటి తరుణంలో స్టార్ దర్శకుడు శంకర్ నుంచి పిలుపొచ్చింది. ఆయన ఐ చిత్రంలో విక్రమ్‌తో చేసిన రొమాన్స్, ఆరబోసిన అందాలు సినీ ప్రేక్షకుల మతులు పోగొట్టాయి. ఎమీకి అవకాశలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఉదయనిధిస్టాలిన్‌తో గెత్తు, ధనుష్‌కు జంటగా తంగమగన్, విజయ్ 59వ చిత్రం అంటూ మూడు చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాదు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఎందిరన్-2 నటించే అవకాశం కొట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. కాగా ఏక్ దీవానా తా చిత్రం ప్లాప్ అవడంతో అక్కడ పాగా వేయాలనే ఆశలు ముగ్గయి పోయాయని భావించిన ఎమీజాక్సన్‌కు తాజాగా అక్కడ ఆశలు చిగురిస్తున్నాయట.

ఇక ఏక్ దీవానా తా చిత్రం సమయంలో ఆ చిత్ర హీరో ప్రతీక్ బాబ్బార్‌తో ప్రేమలో మునిగితేలింది. అయితే అది కొంత కాలమే సాగింది. ఆ ప్రేమ బ్రేక్ అప్ అవడంతో అమ్మడు కొంత కాలం లండన్ బాయ్‌ఫ్రెండ్‌తో చట్టాపట్టాల్ అంటూ తిరిగేసిందని ప్రచారం జోరుగా సాగింది. ఆ బాయ్‌ఫ్రెండ్‌తోనూ తెగతెంపులు చేసుకున్న ఎమీ ఇప్పుడు ముంబాయికి చెందిన ఒక వ్యక్తి ప్రేమలో పడిందట. ఈ వ్యవహారం  మీడియాలో హల్‌చల్ చేస్తున్నా ఆ అమ్మడు మాత్రం ఏలాంటి ఖండనా చేయలేదు. ఇలాంటి ప్రచారాన్ని ఈ అమ్మడు ఎంజాయ్ చేస్తుందేమో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement