సాక్షి, ముంబై : కృష్ణ జింకలను వెంటాడి చంపిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న సల్మాన్ ఖాన్‌కి చిత్ర పరిశ్రమ మొత్తం సానుభూతిని తెలియజేస్తోంది. సల్లూ భాయ్ త్వరగా బయటకు రావాలంటూ బాలీవుడ్ సెలబ్రిటీలంతా బలంగా కోరుకుంటున్నారు. అయితే బ్రిటీష్ సింగర్, బాలీవుడ్ నటి సోఫియా హయత్ మాత్రం సల్మాన్ జైలుకెళ్లటం చాలా సంతోషాన్నిస్తోందంటూ చేసిన పోస్ట్ దుమారాన్ని రేపుతోంది.
‘సల్మాన్ జైలుకెళ్లటం అతని కర్మ. చేసిన పాపాలకు అతను అనుభవిస్తున్నాడు. బాలీవుడ్లో అతనో బడా స్టార్. ఇండస్ట్రీ మొత్తం అతని కనుసైగలో నడుస్తుంది. అందుకే అతనికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు అంతా
జంకుతున్నారు. కానీ, నాకు ఆ భయం లేదు. చేసిన దానికి అతను ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. సల్మాన్ జైలుకెళ్లటం నాకు సంతోషాన్నిస్తోంది’ అంటూ భారత చట్టాలు ఆలస్యమైనా న్యాయాన్ని చేకూరుస్తాయంటూ... పెద్ద పోస్ట్‌నే ఆమె ఉంచింది.
పైగా నో మోర్ హ్యుమన్ అంటూ సల్మాన్ పోస్టర్‌ను షేర్ చేసింది. ఇంగ్లీష్ టీవీ షోలతో పాపులర్ అయ్యి.. అర డజనుకు పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది సోఫియా హయత్(33) బిగ్ బాస్-7 కంటెస్టెంట్ కూడా. అయితే షో లో ఆమె తీరు వివాదాస్పదం కావటం.. పైగా ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ కలిసిరాకపోవటం రాకపోవటంతో బాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసింది.
Comments
Please login to add a commentAdd a comment