controversial comment
-
బీబీ జోడి జడ్జస్‌పై బిగ్‌బాస్ కౌశల్ షాకింగ్ కామెంట్స్, పోస్ట్ వైరల్
బిగ్‌బాస్ కంటెస్టంట్‌తో స్టార్ మా బీబీ జోడి అనే డాన్స్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లో పాల్గొన్న పలువుడు కంటెస్టెంట్స్ జోడిగా పెర్పామెన్స్ ఇస్తున్నారు. ఇందులో సహా కంటెస్టెంట్స్ జోడిగా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు బిగ్‌బాస్ హౌజ్‌లో మాదిగా స్కోర్స్ విషయంలో స్ట్రాటజీ అప్లై చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ జోడి తమ స్ట్రాటజీ వాడి ఎలిమేనేట్ అయ్యింది. ఇక దీనిని తప్పు బడుతూ షో జడ్జస్ అయిన తరుణ్ మాస్టర్, నటి రాధపై అసహనం వ్యక్తం చేశాడు బిగ్‌బాస్ విన్నర్, నటుడు కౌశల్ మండా. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. ‘శంకరాభరణం’ మూవీ ఎడిటర్ మృతి ఇంతకి ఏం జరిగిందంటే.. ఈ బీబీ జోడి షోలో పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ జోడి కట్టి తమ డాన్స్ పర్ఫామెన్స్తో అదరగొడుతున్నారు. అందులో చెప్పుకొదగ్గ జోడిల్లో రవికృష్ణ, భాను జోడి ఒకటి. చెప్పాలంటే బిబి జోడి టైటిల్ కొట్టే సత్తా వారిలో ఉంది. అయితే గతవారం జరిగిన ఎపిసోడ్లో రవి, భాను స్ట్రాటజీ వాడి షో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తమ కో-కంటెస్టెంట్స్ అయిన వాసంతి-అర్జున్ కల్యాణ్ జోడి తమ డాన్స్‌తో జడ్జస్‌ను మెప్పించారు. వారి చేత వావ్ అంటూ ప్రశంసలు అందుకున్నారు. ఇక సహ కంటెస్టెంట్స్ కూడా వారి డాన్స్‌ని మెచ్చకుంటూ స్కోర్స్ ఇచ్చారు. అయితే రవి-భాను మాత్రం ఒక్క మార్కే ఇచ్చి షాకిచ్చారు. ఇది నిజమా? ప్రాంక్‌గా అని జడ్జస్ అడుగగా.. ఇది తమ స్ట్రాటజీ అని సమాధానం ఇచ్చారు. నిజానికి వారి ప్రెర్ఫామెన్స్‌కి 10 మార్కులు ఇవ్వాలి, కానీ తాము సేవ్ అవ్వాలంటే వారికి ఒక్క మార్కు ఇచ్చామన్నారు. దీంతో జడ్జస్ కూడా తమ స్ట్రాటజీని వాడి వారికి అతి తక్కువ మార్కులు ఇచ్చారు. ఫలితంగా భాను-రవి ఎలిమేనేషన్ ఫేస్ చేసి షో నుంచి వెళ్లిపోయారు. ఇక దీనిపై కౌశల్ మండా స్పందిస్తూ జడ్జస్‌పై తీరు తప్పుబడ్డాడు. ఈ మేరకు ఫేస్బుక్లో వివాదస్పద పోస్ట్ షేర్ చేశౠడు. ‘నా ఉద్దేశం ప్రకారం బీబీ జోడి విజేతలు రవి,భాను శ్రీ. ఎందుకంటే.. వాళ్లు డ్యాన్స్ చేసిన విధానం, ప్రతి రౌండ్లో పింక్ సీటు గెలుచుకున్న తీరు అద్భుతం. చదవండి: ఆ మూవీ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడా? కారణం ఇదేనా! బిగ్‌బాస్ పోటీదారులుగా వారి వ్యూహాల ప్రకారం ఆడటానికి వారికి అన్ని హక్కు ఉంది. కానీ న్యాయనిర్ణేతలకు లేదు. జడ్జస్ కేవలం కంటస్టెంట్స్ డాన్స్ మాత్రమే జడ్జ్ చేయాలి, వారి వ్యూహలను కాదు. బిగ్‌బాస్‌లో ఏ జోడి గెలిచిన అది రవి-భాను తర్వాతే అనేది నా అభిప్రాయం. నాకు అనిపించింది చెప్పాను. నిజాన్ని మనసులోనే దాచుకోలేను. క్షమించండి జడ్జస్’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కౌశల్‌కు మద్దతు తెలుపుతుంటే మరికొందర అతడిని తప్పుబడుతున్నారు. రవి భాను కేవలం ఒక్క మార్క్ ఇవ్వడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదే షోలో కౌశల్ కూడా కంటెస్టెంట్‌గా ఉండటం గమనార్హం. అభినయ శ్రీతో జోడి కట్టి తన డాన్స్‌తో మెప్పిస్తున్నాడు కౌశల్. -
శాంతిభద్రతలే ముఖ్యం.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలగడానికి వీల్లేదని.. చట్టాన్ని చేతిలోకి తీసుకునేవారిని ఉపేక్షించాల్సిన ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకునే వారిపై, మతాల మధ్య చిచ్చుపెట్టే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వీడియో, తదనంతర పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లో ఎలాంటి మతపరమైన ఘర్షణలు లేకుండా ప్రజలు హాయిగా, ప్రశాంతంగా జీవిస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇలాంటి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా సహించేది లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరూ కూడా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండు రోజుల కిందట విడుదల చేసిన వీడియోలో ఓ వర్గం మతగురువును కించపరిచారనే ఆరోపణలు, దానిపై మజ్లిస్ శ్రేణులు నిరసనలకు దిగడం, రాజాసింగ్ అరెస్టు, బెయిల్‌పై విడుదల తదితర ఘటనల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఆరోపణలతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కుమార్తె కవిత ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించడం.. బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల ఘర్షణ, బీజేపీ కార్యకర్తలపై కేసులను నిరసిస్తూ బీజేపీ నిరసన కార్యక్రమాలకు దిగింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో పలుచోట్ల ఉద్రిక్తత, యాత్ర ఆపేయాలని వరంగల్ పోలీసుల నోటీసులతోనూ బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఇక రాజాసింగ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్‌ఖాన్ ఓ వర్గం ప్రజలకు పిలుపునిచ్చారు. వీటన్నింటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ శాంతిభద్రతల పరిస్థితిపై హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో బుధవారం సాయంత్రం అత్యవసర సమీక్ష నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచీ శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తున్న విషయాన్ని సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా మత ఘర్షణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కొందరు మతాల మధ్య చిచ్చుపెట్టడానికి, విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడినట్టు తెలిసింది. ఎవరి మతాలు, ఆచారాలను వారు ఆచరించుకోవచ్చని.. కానీ ఇతరులను కించపర్చేలా వ్యవహరించడం సహించరానిదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ పరిస్థితిని అదనుగా చేసుకుని కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు రెచ్చిపోయే అవకాశం ఉంటుందని.. అందువల్ల ఆదిలోనే దీనిని తుంచివేయాలని ఉన్నతాధికారులకు సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసు యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన పక్షంలో మరిన్ని బలగాలను రప్పించి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిసింది. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుంది రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగున్నందునే దేశవిదేశాల పెట్టుబడులు వస్తున్నాయని, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఏర్పాటవుతున్నాయని సీఎం కేసీఆర్ గుర్తుచేసినట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఘటనలపై జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతోందని.. ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజి దెబ్బతింటుందని హెచ్చరించినట్టు సమాచారం. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న వారిని ఓ కంట కనిపెట్టి ఉండాలని.. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా సున్నిత ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు: మహమూద్ అలీ శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంబిస్తోందని.. ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇతర మతస్తుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడి అశాంతి సృష్టించాలనుకునే వారిని రాష్ట్ర ప్రభుత్వం సహించబోదని బుధవారం రాత్రి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయని.. వీటిపై చట్టపరమైన చర్యలు చేపడతామని ప్రకటించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. ఇతర మతాలను ఎవరూ కించపర్చరాదని, మనోభావాలను దెబ్బతీయరాదని స్పష్టం చేశారు. ప్రజలంతా సంయమనంతో, సోదరభావంతో ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. -
టీఎంసీ నాయకులపై తాలిబన్ల తరహాలో దాడి చేయండి..
అగర్తలా: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అధికార బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ త్రిపురలోని బెలోనియా నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన అరుణ్ చంద్ర భౌమిక్.. ఇటీవల తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎంసీ నాయకులు అగర్తలా ఎయిర్‌పోర్టులో కాలుపెడితే వారిపై తాలిబన్ల తరహాలో దాడి చేయాలని తన మద్దతుదారులను రెచ్చగొట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకు టీఎంసీ నాయకులు త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ఒంట్లో చివరి రక్తపుబొట్టు ఉన్నంతవరకూ తాము బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీఎంసీ నేతలు మండిపడుతున్నారు. సదరు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదిలా ఉంటే, త్రిపురలో 25 ఏళ్ల కమ్యూనిస్ట్‌ల పాలన తరువాత బిప్లవ్ దేవ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. తమ ప్రభుత్వాన్ని అస్తిర పరిచేందుకు టీఎంసీ నేతలు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2023లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండడంతో అన్ని రాజకీయ పక్షాలు ఇప్పటినుంచే తమ కార్యాచరణను మొదలుపెట్టాయి. చదవండి: శక్తిమంతమైన 'జీరో రూపాయి నోట్' గురించి మీకు తెలుసా? -
వివాదాస్పద ట్వీట్.. రంగోలి ఖాతా తొలగింపు
కంగనా రనౌత్ సోదరి, ఫైర్‌బ్రాండ్ రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను అధికారులు తొలగించారు. ఓ వర్గాన్ని ఉద్ధేశించి రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోందని బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన ఆరోపణలపై స్పందించిన ట్విటర్ అధికారులు ఆమె అకౌంట్‌ను సస్పెండ్ చేశారు. కాగా బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన వారిని, సెక్యూలర్ మీడియాను కాల్చి చంపాలని రంగోలి ట్వీట్ చేశారు. (రంగోలి సంచలన వ్యాఖ్యలు) ఈ ట్వీట్ కాస్తా వైరలవ్వడంతో రంగోలి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని దర్శకుడు రీమా కగ్టి, నటి కుబ్రా సైత్తోపాటు కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ సహా ట్విటర్లో ఫిర్యాదు చేశారు. ఒక వర్గంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన రంగోలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముంబై పోలీసులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ట్యాగ్ చేశారు. వీటిపై స్పందించిన ట్విటర్ అధికారులు వెంటనే రంగోలి అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. చివరికి రంగోలి అకౌంట్‌ను అధికారులు తొలగించడంతో ఫరాఖాన్తోపాటు తదితర నటులు ట్విటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. (‘అలా అయితే.. కంగనా నటన వదిలేస్తుంది’) Thank you @Twitter @TwitterIndia @jack for suspending this account. I reported this because she targeted a specific community and called for them to be shot along with liberal media and compared herself to the Nazis. 🙏🙏🙏 . pic.twitter.com/lJ3u6btyOm — Farah Khan (@FarahKhanAli) April 16, 2020 -
‘పెట్రోల్..డీజిల్‌తో రెడీగా ఉండండి’
భువనేశ్వర్ : ఒడిశాలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ తన వ్యాఖ్యలతో వివాదానికి కేంద్ర బిందువయ్యారు. డిసెంబర్ 14న మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి, హత్య ఘటనను నిరసిస్తూ పార్టీ ఇచ్చిన సమ్మె పిలుపుపై కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విపక్ష కాంగ్రెస్ గురువారం 12 గంటల పాటు నవరంగ్‌పూర్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. బంద్ పిలుపుపై ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ అందరూ పెట్రోల్, డీజిల్‌తో రెడీగా ఉండండి..మా వద్ద నుంచి సూచన రాగానే కనిపించిన వాటినన్నీ దగ్ధం చేయండి..తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అంటూ మాఝీ ఫోన్లో మాట్లాడుతున్న వీడియో వెలుగుచూసింది. అయితే తన వ్యాఖ్యలపై ఆయన ఎలాంటి విచారం వెలిబుచ్చకపోవడం గమనార్హం. తాము నేతాజీ సుభాష్ చంద్రబోస్ విధానాన్ని అనుసరిస్తున్నామని, జిల్లాలో అమాయక బాలికలపై హత్యాచార ఘటనలపై ప్రభుత్వం స్పందించకుంటే తాము ఇలాగే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మైనర్ బాలికపై హత్యాచార ఘటన జరిగి 13 రోజులు దాటినా పోలీసులు ఇంతవరకూ పోస్ట్‌మార్టం నివేదికను పొందలేదని, వైద్యులు, హోంశాఖ, ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అమాయక బాలికలపై లైంగిక దాడుల విషయంలో గాంధీగిరితో న్యాయం జరగదని మాఝీ చెప్పుకొచ్చారు. -
అత్యాచారం అంటే...మంత్రి వివాదాస్పద వ్యాఖ్య
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి "అత్యాచార స్వభావం" పై విచిత్ర భాష్యం చెప్పుకొచ్చారు. నీటి సరఫరా, భూ అభివృద్ధి, నీటి వనరుల శాఖ మంత్రి ఉపేంద్ర తివారీ అత్యాచార ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు దేశవ్యాప్తంగా పసిమొగ్గలు, మైనర్ బాలికలపై పాశవికమైన అత్యాచారం, హత్యలు తీవ్ర ఆందోళన రేపుతోంటే.. బాద్యతా యుతమైన మంత్రి స్థానంలో ఉన్న తివారి వ్యాఖ్యలు మరింత ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. మహిళలపై బాధ్యతారహిత వ్యాఖ్యలతో నోరు పారేసుకున్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మైనర్ బాలికలపై జరిగిన అత్యాచారాలు మాత్రమే నిజమైన రేప్‌లుగా పరిగణించాలని తివారి వ్యాఖ్యానించారు. కానీ కొన్నిసార్లు 30-35 వివాహిత మహిళలు కూడా రేప్ ఆరోపణలతో ముందుకు వస్తున్నారని, అయితే ఈ ఘటనల స్వభావం వేరుగా ఉంటుందని, ఇలాంటి కేసులను భిన్నంగా చూడాలన్నారు. ఈ మహిళలు చేస్తున్న అత్యాచార ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాదు సదరు మహిళలు 7-8 సంవత్సరాలుగా నిందితుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వుండి వుంటారని పేర్కొన్నారు. తివారీ వ్యాఖ్యలపై నెటిజన్లు మండి పడుతున్నారు. యూపీ అలీగఢ్‌లో రెండున్నరేళ్ల పాప దారుణ హత్యపై స్పందించిన ఉపేంద్ర తివారీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అత్యాచార ఘటనలు నమోదైన వెంటనే ముఖ్యమంత్రి వేగంగా స్పందించి విచారణకు ఆదేశించడంతోపాటు, నేరస్తులపై కఠిన చర్య తీసుకుంటున్నారని చెప్పడం కొసమెరుపు. #WATCH UP Minister Upendra Tiwari: Dekhiye rape ka nature hota hai, ab jaise agar koi nabalig ladki hai uske sath rape hua hai toh usko to hum rape manenge, lekin kahin-kahin pe ye bhi sunne ko aata hai ko ki vivahit mahila hai, umar 30-35 saal hai....uska alag-alag nature hai pic.twitter.com/Ou1AMPsvGB — ANI UP (@ANINewsUP) June 9, 2019 -
‘ఆ ట్వీట్‌పై రాద్ధాంతం అవసరమా’
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మా గాంధీపై ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరి చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వివరణ ఇచ్చారు. గాడ్సేకు కృతజ్ఞతలు అంటూ పదిహేను రోజుల కిందట ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ‘మన కరెన్సీపై గాంధీ ముఖాన్ని తొలగించడం, ప్రపంచవ్యాప్తంగా ఆయన విగ్రహాలను రూపుమాపడం, ఆయన పేరిట నెలకొల్పిన సంస్ధలు, రహదారుల పేర్లు మార్చడం ఇప్పుడు తక్షణం మనం చేయాల్సిన పని..ఇదే మనం ఆయనకు ఇచ్చే ఘననివాళి..థ్యాంక్యూ గాడ్సే’ అంటూ ఆమె చేసిన ట్వీట్ కలకలం రేపింది. విమర్శలు వెల్లువెత్తడంతో ట్వీట్‌ను ఆమె తొలగించారు. నిధి చౌదరిని ప్రభుత్వ సర్వీసు నుంచి సస్పెండ్ చేయాలని ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ డిమాండ్ చేశారు. కాగా, గాంధీని అవమానించే వారిపై తన తీవ్ర ఆగ్రహం, ఆందోళనకు తన ట్వీట్ అద్దం పడుతుందని ఆమె వ్యాఖ్యానించారు. గాంధీజీకి ప్రజలు తమదైన భిన్న రీతుల్లో నివాళులు అర్పిస్తుంటారని చెప్పుకొచ్చారు. గాంధీజీ 150 జయంతోత్సవాలను ప్రపంచమంతా జరుపుకునే సమయంలో కొన్ని శక్తులు మహాత్మ గాంధీని కించపరిచేలా, ఆయన అందించిన ఘన వారసత్వాన్ని నిర్మూలించేలా నాథూరాం గాడ్సేను కొనియాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను పదిహేను రోజుల కిందట చేసిన ట్వీట్‌పై ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిధి చౌదరి ప్రశ్నించారు. తాను గాంధీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయలేదని, తాను మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తానని, ఆయన ఆటోబయోగ్రఫీ తనకు ఇష్టమైన పుస్తకమని చెప్పుకొచ్చారు. -
శాకాహారి ఎంపీకి చేపల మార్కెట్లో ఆదరణ
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వివాదంలో చిక్కుకున్నారు. మత్స్యకారులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్‌పై కేరళ బీజేపీ, సీపీఎం నాయకులు మండిపడ్డారు. మత్స్యకారులకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. థరూర్ ట్వీట్‌కు వ్యతిరేకంగా కొచ్చి, కొల్లాం, కోజికోడ్‌లలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. తాను రాసిన పదాల్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని థరూర్ వివరణ ఇచ్చారు. తిరువనంతపురం నుంచి లోక్‌సభ బరిలో నిలిచిన థరూర్ ప్రచారంలో భాగంగా ఇటీవల స్థానిక చేపల మార్కెట్లో పర్యటించారు. ‘ఎంతో నిష్టతో శాకాహారాన్ని మాత్రమే భుజించే ఎంపీకి చేపల మార్కెట్లో మంచి ఆదరణ లభించింది’ అని ట్వీట్ చేశారు. అనంతరం వివాదం రేగడంతో.. ప్రేమ కురిపించారని చెప్పడమే తన ఉద్దేశమని, ఎవరినీ అవమానించడం కాదని వివరణ ఇచ్చారు. తన కుటుంబంలో తాను మినహా అందరూ చేపలు తింటారన్నారు. మత్స్యకారులకు ఏమీ చేయని వారు కూడా ఒక్క పదాన్ని సాకుగా చూపి విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేరళ వరదల సందర్భంగా సహాయక చర్యల్లో పాలుపంచుకున్న మత్స్యకారులను థరూర్ ఫిబ్రవరిలో నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయడం తెల్సిందే. -
‘ఆమె శూర్పణక.. ఆ పార్టీ రావణుడు’
లక్నో : బీజేపీ నాయకులు ఆచితూచి మాట్లాడాలంటూ ఏకంగా ప్రధాని మోదీ హెచ్చరించినా వారి తీరు మారడం లేదు. ఇటీవలి కాలంలో పలువురు బీజేపీ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమైన మమతా బెనర్జీని సూర్పణకతో పోల్చారు. రావణుని సోదరి అయిన శూర్పణకకు పట్టిన గతే ఆమెకు పడుతుందంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా మమత ముక్కు కోస్తారంటూ వివాదానికి తెరతీశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని రావణునితో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బెంగాల్ మరో కాశ్మీర్ అయ్యేది’.. ఇటీవలి కాలంలో బెంగాల్లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో సురేంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. బెంగాల్లో హిందువులకు రక్షణ లేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కనీస బాధ్యత కూడా నిర్వర్తించడం లేదని విమర్శించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు బెంగాల్లో చొరబడి హిందువులను హింసిస్తున్నారన్నారు. మోదీ వంటి ప్రధాని ఉండడం మన అదృష్టం అని.. లేకుంటే ఈపాటికి బెంగాల్ మరో కాశ్మీర్ అయ్యేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ సురేందర్ సింగ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఉన్నావ్ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్ సింగార్‌ను సమర్థిస్తూ బాధితురాలి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. -
సల్మాన్‌పై నటి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : కృష్ణ జింకలను వెంటాడి చంపిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న సల్మాన్ ఖాన్‌కి చిత్ర పరిశ్రమ మొత్తం సానుభూతిని తెలియజేస్తోంది. సల్లూ భాయ్ త్వరగా బయటకు రావాలంటూ బాలీవుడ్ సెలబ్రిటీలంతా బలంగా కోరుకుంటున్నారు. అయితే బ్రిటీష్ సింగర్, బాలీవుడ్ నటి సోఫియా హయత్ మాత్రం సల్మాన్ జైలుకెళ్లటం చాలా సంతోషాన్నిస్తోందంటూ చేసిన పోస్ట్ దుమారాన్ని రేపుతోంది. ‘సల్మాన్ జైలుకెళ్లటం అతని కర్మ. చేసిన పాపాలకు అతను అనుభవిస్తున్నాడు. బాలీవుడ్లో అతనో బడా స్టార్. ఇండస్ట్రీ మొత్తం అతని కనుసైగలో నడుస్తుంది. అందుకే అతనికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు అంతా జంకుతున్నారు. కానీ, నాకు ఆ భయం లేదు. చేసిన దానికి అతను ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. సల్మాన్ జైలుకెళ్లటం నాకు సంతోషాన్నిస్తోంది’ అంటూ భారత చట్టాలు ఆలస్యమైనా న్యాయాన్ని చేకూరుస్తాయంటూ... పెద్ద పోస్ట్‌నే ఆమె ఉంచింది. పైగా నో మోర్ హ్యుమన్ అంటూ సల్మాన్ పోస్టర్‌ను షేర్ చేసింది. ఇంగ్లీష్ టీవీ షోలతో పాపులర్ అయ్యి.. అర డజనుకు పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది సోఫియా హయత్(33) బిగ్ బాస్-7 కంటెస్టెంట్ కూడా. అయితే షో లో ఆమె తీరు వివాదాస్పదం కావటం.. పైగా ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ కలిసిరాకపోవటం రాకపోవటంతో బాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసింది. Karma gets you in the end...Many people are afraid to talk against Salman because they think he controls Bollywood. Well, I no longer serve my ego and therefore am not afraid to speak up. I am so happy that Salman has gone to jail for what he has done. Animals are so important to this planet and doing what he did and then mocking it was a huge act of his own self importance. Lots of children look up to him, and he has a responsibility to the young people.What is he showing the world when he does things like this? What lessons is he giving them? That it is ok to break the law, to kill animals and then mock it because he is a celebrity? In any western country he would have been vilified for this and the drink driving deaths that he caused. He has then reinvented himself as a charitable man to try and compensate his karma. Today, India has shown that no matter who you are, if you break the law, you are no bigger than the law. I have heard so many young people in India speak about how they are afraid to go to the police about crimes committed by others because they watch the tv and see how people with money and status get away with it because they have paid off the police or the judge or the lawyers. This happened to me when Armaan Kohli paid off 2 of my lawyers so that I could not continue with the case, Dolly Bindra also told me that Armaans family are powerful enough to put drugs in my bag at the airport and I would be in Jail. I had to then drop the case as all the lawyers I hired were paid off. Today, Hindustan can stand strong and hold its head up high to the world and show them that justice is held up in India, and today, all the poor people have been shown a glimmer of hope in their own fight for justice against those who have manipulated the law. Today I can say Hindustaan Zindabaad! A post shared by Sofia Hayat (@sofiahayat) on Apr 5, 2018 at 10:40am PDT -
వాట్సాప్‌లో కామెంట్.. ఉద్యోగం ఊడింది
నగరంలోని ప్రతిష్టాత్మకమైన కేఎంసీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పనిచేస్తున్న సునీల్ వాగ్మేర్‌ను చితకబాదుతున్నారన్న విషయం తెలిసి ముంబై పోలీసులు ఆయన్ని రక్షించడానికి హుటాహుటిన కాలీజీకి వెళ్లారు. అక్కడ ఆయన్ని బాదుతున్నది ఎవరో కాదు, ఆయన సహచర అధ్యాపకులు, విద్యార్థులు. చేయిచేసుకున్న వారిని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు బాధితుడైన సునీల్ వాగ్మేర్‌ను అరెస్ట్ చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని 295 ఏ సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు. ఆయనపై దాడిచేసిన వారిపై చర్య తీసుకోవాల్సిన కాలేజీ యాజమాన్యం ప్రొఫెసర్ సునీల్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన చేసిన తప్పేమిటంటే ‘ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని ఫిబ్రవరి 19వ తేదీనే అధికారికంగా జరుపుకున్నాం, మళ్లీ మార్చి 15వ తేదీన ఎందుకు జరుపుకుంటున్నారు’ అంటూ తన వాట్సాప్ గ్రూప్‌లో తన సహచర అధ్యాపకులను ప్రశ్నించడమే. మార్చి 16న కాలేజీకి వచ్చిన ప్రొఫెసర్ సునీల్‌ను పట్టుకొని ఆయన సహచర అధ్యాపకులు, హిందూ విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు చితకబాదారు. కొంతమంది హిందుత్వ వాదుల ఒత్తిడి మేరకు పోలీసులు బాధితుడినే అరెస్ట్ చేశారు. ఛత్రపతి శివాజీ జయంతిపై వివాదం ఈనాటిది కాదు. ఈ వివాదం ఇతర వర్గాల మధ్యన కాకుండా హిందూ వర్గాల మధ్యనే ఉండడం విశేషం. మహారాష్ట్రలో గ్రెగోరియన్ క్యాలండర్ ప్రకారం కొంత మంది ఫిబ్రవరి 19వ తేదీన శివాజీ జయంతిని జరుపుకుంటారు. ఎక్కువ మంది ప్రజలు మాత్రం ఫల్గుణ మాసం మూడోరోజు తదియ నాడు జయంతిని జరుపుకుంటారు. తిథి ప్రకారం ఈసారి శివాజీ జయంతి మార్చి 15 తేదీన వచ్చింది. దాన్ని ప్రశ్నించడం సునీల్‌ది తప్పయింది. తిథి ప్రకారమే శివాజీ జయంతిని జరుపుకోవాలన్నది శివసేన మొదటి నుంచి చేస్తున్న వాదన. శివాజీ స్వయంగా మొఘల్ చక్రవర్తుల కాలంలో ఇస్లాం క్యాలెండర్‌ను తిరస్కరించినప్పుడు ఇతర దేశాలకు చెందిన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం శివాజీ జయంతిని జరుపుకోవడం ఏమిటన్నది శివసేన ప్రశ్న. 1582లో ప్రపంచంలో చాలా దేశాలు ప్రామాణికంగా గుర్తించిన క్యాలెండర్ ‘గ్రెగోరియన్ క్యాలండర్’. అప్పటి పోప్ గ్రెగోరియన్ పేరిట వచ్చిన ఈ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో వచ్చే తేడా 0.002 శాతం మాత్రమే అయినందున నాటి కాలంలో గణిత పండితులు ఎక్కువ మంది దీన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. శివాజీ 16వ శతాబ్దంలో పుట్టారన్నది నిజమే అయినా.. ఏ సంవత్సరం, ఏ తేదీన పుట్టింది ఎవరికీ తెలియదు. ఆయన రాజ కుటుంబంలో కాకుండా శివాజీ భోన్స్లే అనే పోలీసు సుబేదార్కు పుట్టడమే అందుకు కారణం. రాజకుటుంబంలో పుట్టి ఉంటే కచ్చితంగా పుట్టిన రోజు నమోదయ్యేది. 1627లో పుట్టారని కొంత మంది, 1630లో పుట్టారని కొంత మంది చరిత్రకారులు చెబుతున్నారు. సంఘ సంస్కర్త లోకమాన్య తిలక్ 1980లో మొదటి సారిగా శివాజీ జయంతికి ప్రాచుర్యం కల్పించారు. అప్పటి నుంచి శివాజీ జయంతిపై వివాదం మరింత పెరిగింది. 2000 సంవత్సరంలో అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వివాదానికి తెరదించేందుకు చరిత్రకారులతో ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ ఫిబ్రవరి 19వ తేదీనే ఖరారు చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజును సెలవుదినంగా పాటిస్తోంది. అయినా వివాదం మాత్రం అలాగే కొనసాగుతోంది. రెండు తీదీలు వసంత మాసంలోనే వస్తున్నాయి కనుక ఏ రోజైనా జరుపుకోవచ్చని కొందరు సూచిస్తుండగా, రెండు రోజులూ జరుపుకోవచ్చని అహింసావాదులు సూచిస్తున్నారు. సునీల్‌పై దాడిని ఖండించని శివసేన మాత్రం, శివాజీ గొప్ప నాయకుడని, ప్రతిరోజు ఆయన జయంతిని జరుపుకోవచ్చని చెప్పింది.