ఆర్మాన్ ను అంత తొందరగా ఎందుకు వదిలేశారో: సోఫియా
బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్7 పాల్గొన్న ఆర్మాన్ కోహ్లీకి అంత తొందరగా బెయిల్ లభించడం తనకు ఆశ్చర్యం కలిగించింది అని బ్రిటిష్ గాయని, నటి సోఫియా హయత్ అన్నారు. అతన్ని ఎందుకు అంత తొందరగా వదిలిపెట్టారో అర్ధం కావడం లేదు అని అనుమానం వ్యక్తం చేసింది. ఫుటేజి చూసిన తర్వాత.. బలమైన సాక్ష్యం లభించినా అతన్ని ఎందుకు వదిలేశారలో తెలియడం లేదన్నారు. ఈ కేసు ను తన లాయర్ చూసుకుంటున్నాడని సోఫియా వెల్లడించింది. తాను మూడు సెక్షన్లతో కేసు నమోదు చేశా.. అయితే ఫుటేజ్ చూసిన తర్వాత మరికొన్ని సెక్షన్లను పోలీసులు జోడించారని తెలిపింది.
డిసెంబర్ 28న జరిగే బిగ్ బాస్ ఫైనల్ లో భారీ మొత్తాన్ని గెలుచుకోవడానికి గుహార్ ఖాన్, వీజే ఆండీ, తనీషా ముఖర్జీ, సంగ్రామ్ సింగ్, ఎజాజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. గుహార్ ఖాన్ బిగ్ బాస్ టైటిల్ గెలిచే అవకాశం ఉంది అని సోఫియా తెలిపారు. బిగ్ బాస్ 7' రియాల్టీ షోలో తనపై దాడి చేయడమే కాకుండా లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిసెంబర్ 17 తేదిన బిగ్ బాస్ హౌజ్ నుంచి ఆర్మాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో ఆర్మాన్ ను బిగ్ బాస్ నుంచి తప్పించారు.