Duleep Trophy 2022: Captain Ajinkya Rahane Smashes Double Century For West Zone - Sakshi
Sakshi News home page

Duleep Trophy 2022: డబుల్‌ సెంచరీతో చెలరేగిన అజింక్య రహానే...

Published Sat, Sep 10 2022 8:36 AM | Last Updated on Sat, Sep 10 2022 9:27 AM

Captain Ajinkya Rahane smashes double century for West Zone in Duleep Trophy - Sakshi

చెన్నై: భారత టెస్టు జట్టులో కోల్పోయిన స్థానాన్ని మళ్లీ సాధించాలని పట్టుదలగా ఉన్న అజింక్య రహానే దేశవాళీ సీజన్‌ను ఘనంగా ప్రారంభించాడు. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో వెస్ట్‌జోన్‌ బ్యాటర్‌ రహానే (264 బంతుల్లో 207 బ్యాటింగ్‌; 18 ఫోర్లు, 6 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీతో సత్తా చాటాడు.

అతనికి తోడు యశస్వి జైస్వాల్‌ (321 బంతుల్లో 228; 22 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ద్విశతకం బాదడం విశేషం. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి వెస్ట్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 590 పరుగులు చేసింది.

ఓపెనర్‌ పృథ్వీ షా (121 బంతుల్లో 113; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా శతకం సాధించాడు. బలమైన వెస్ట్‌జోన్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ముందు అనామక జట్టుగా నార్త్‌ ఈస్ట్‌ తేలిపోయింది.
చదవండిAsia Cup 2022: పాక్‌కు షాకిచ్చిన శ్రీలంక​.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement