ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ దుమ్ములేపుతున్నాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. ఇప్పుడు మరో ద్విశతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో విధ్వంసకర డబుల్ సెంచరీతో యశస్వీ చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లను జైశ్వాల్ ఊచకోత కోశాడు. సెంచరీ తర్వాత మూడో రోజు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి జైస్వాల్.. నాలుగో రోజు బ్యాటింగ్‌కు వచ్చి వీర విహారం చేశాడు.
ఈ క్రమంలో జైశ్వాల్ కేవలం 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 238 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 14 ఫోర్లు, 12 సిక్సులతో అజేయంగా 214 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కాగా జైశ్వాల్‌కు తన కెరీర్‌లో ఇది రెండో డబుల్ డబుల్ సెంచరీ కావడం గమనార్హం.
అంతకుముందు వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో యశస్వీ 209 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జైశ్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్(91), అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్(68*) అద్భుతంగా రాణించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌ను భారత జట్టు 430/4 పరుగుల భారీ స్కోర్ వద్ద తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు టీమిండియా 557 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥
— BCCI (@BCCI) February 18, 2024
Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx
Comments
Please login to add a commentAdd a comment