రిషభ్‌ పంత్‌ అని ఓ కుర్రాడు ఉండేవాడు: రోహిత్‌ కౌంటర్‌ అదుర్స్‌ | India Vs England Test: India Captain Rohit Sharma Has Taken A Hilarious Dig At Ben Duckett - Sakshi
Sakshi News home page

రిషభ్‌ పంత్‌ అని ఓ కుర్రాడు ఉండేవాడు: రోహిత్‌ కౌంటర్‌ అదుర్స్‌

Published Wed, Mar 6 2024 2:46 PM | Last Updated on Wed, Mar 6 2024 3:48 PM

Guy Named Rishabh: Rohit Befitting Reply To England Star Bizarre Jaiswal Remark - Sakshi

రోహిత్‌ శర్మ (ఫైల్‌ ఫొటో - PC: BCCI)

రాజ్‌కోట్‌ టెస్టులో యశస్వి జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి ఇంగ్లండ్‌ బ్యాటర్‌ బెన్‌ డకెట్‌ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా సారథి రోహిత్‌ శర్మ దిమ్మదిరిగేలా కౌంటర్‌ ఇచ్చాడు. రిషభ్‌ పంత్‌ పేరును ప్రస్తావిస్తూ.. ఇంగ్లిష్‌ జట్టుకు తమ స్థాయి ఏమిటో గుర్తుచేశాడు.

కాగా ఓపెనర్‌గా భారత టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న యశస్వి జైస్వాల్‌.. ఇంగ్లండ్‌పై వరుస డబుల్‌ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరుగుతున్న తాజా సిరీస్‌లో.. ‘బజ్‌బాల్‌’ను తలదన్నేలా ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రాజ్‌కోట్‌ వేదికగా యశస్వి జైస్వాల్‌ ఆడిన ఇన్నింగ్స్‌(151 బంతుల్లో 153 పరుగులు)ను ఉద్దేశించి ఇంగ్లండ్‌ బ్యాటర్‌ బెన్‌ డకెట్‌ ‘‘ప్రత్యర్థి జట్టు కూడా దూకుడుగా ఆడుతోందంటే అందులో మాకూ కొంత క్రెడిట్‌ దక్కుతుంది. టెస్టు క్రికెట్‌లో మాలాగే వాళ్లూ ఆడుతున్నారు’’ అని పేర్కొన్నాడు. 

తాజాగా ఈ విషయం గురించి రోహిత్‌ శర్మకు ప్రశ్న ఎదురైంది. ధర్మశాల టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో డకెట్‌ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరగా.. ‘‘మా జట్టులో రిషభ్‌ పంత్‌ అని ఓ కుర్రాడు ఉండేవాడు.

బహుశా బెన్‌ డకెట్‌ అతడి ఆట తీరును చూసి ఉండడు’’ అని రోహిత్‌ శర్మ డకెట్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించాడు. విదేశీ గడ్డపై కూడా దూకుడైన ఆటకు పంత్‌ మారుపేరు అన్న విషయాన్ని గుర్తుచేస్తూ హిట్‌మ్యాన్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది.

ఇరుజట్ల మార్చి 7 నుంచి నామమాత్రపు ఐదో టెస్టు ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్‌ ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 655 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు.

చదవండి: Sarfaraz Khan: వారిని డబ్బు అడుగుతున్న సర్ఫరాజ్‌ తండ్రి?! నిజం ఇదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement