SL Vs PAK 2nd Test: Abdullah Shafique Hits His Maiden Double Century In Test Cricket - Sakshi
Sakshi News home page

Abdullah Shafique: లంక గడ్డపై డబుల్‌ సెంచరీ బాదిన తొలి ఓపెనర్‌గా.. మూడో యంగెస్ట్‌ క్రికెటర్‌గా

Published Wed, Jul 26 2023 4:36 PM | Last Updated on Wed, Jul 26 2023 5:35 PM

PAK-Abdullah Shafique Maiden Double Century-Test Cricket Vs SL 2nd Test - Sakshi

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్‌ ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ డబుల్‌ సెంచరీతో మెరిశాడు. 322 బంతులెదుర్కొన్న షఫీక్‌ 19 ఫోర్లు, 4 సిక్సర్లతో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా టెస్టు క్రికెట్‌లో అబ్దుల్లా షఫీక్‌కు ఇదే తొలి డబుల్‌ సెంచరీ కావడం విశేషం. కాగా 23 ఏళ్ల వయసున్న అబ్దుల్లా షఫీక్‌ పాక్‌ తరపున డబుల్‌ సెంచరీ బాదిన మూడో యంగెస్ట్‌ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు జావెద్‌ మియాందాద్‌, హనీఫ్‌ మొహమ్మద్‌లు ఈ ఘనత సాధించారు. ఇక లంక గడ్డపై డబుల్‌ సెంచరీ బాదిన తొలి పాక్‌ ఓపెనర్‌గానూ అబ్దుల్లా షఫీక్‌ చరిత్రకెక్కాడు.

ఇక రెండో టెస్టులో పాకిస్తాన్‌ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన పాక్‌ సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రస్తుతం పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 458 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్‌కు(200 నాటౌట్‌) అగా సల్మాన్‌(80 బంతుల్లో 70 బ్యాటింగ్‌) చక్కగా సహకరిస్తున్నాడు. ఆశితో ఫెర్నాండో మూడు వికెట్లు తీయగా.. ప్రభాత్‌ జయసూరియా ఒక వికెట్‌ పడగొట్టాడు.

ఇప్పటివరకు పాకిస్తాన్‌ 292 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడం.. వరుణుడు అడ్డుపడకపోతే మాత్రం పాకిస్తాన్‌ విజయాన్ని ఆపడం లంకకు కష్టసాధ్యమనే చెప్పొచ్చు. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది.ధనుంజయ డిసిల్వా 57, దినేశ్‌ చండిమల్‌ 34 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. పాక్‌ బౌలర్లలో అబ్రర్‌ అహ్మద్‌ నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్‌ షా మూడు, షాహిన్‌ అఫ్రిది ఒక వికెట్‌ తీశాడు.

చదవండి: Saud Shakeel: అజేయ డబుల్‌ సెంచరీతో అదరగొట్టి.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలతో పాటు!

Abdullah Shafique: సెంచరీతో మెరిసిన పాక్‌ ఓపెనర్‌.. భారీ ఆధిక్యం దిశగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement