sinhalese sports club
-
లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి ఓపెనర్‌గా..
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ డబుల్ సెంచరీతో మెరిశాడు. 322 బంతులెదుర్కొన్న షఫీక్ 19 ఫోర్లు, 4 సిక్సర్లతో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా టెస్టు క్రికెట్లో అబ్దుల్లా షఫీక్‌కు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. కాగా 23 ఏళ్ల వయసున్న అబ్దుల్లా షఫీక్ పాక్ తరపున డబుల్ సెంచరీ బాదిన మూడో యంగెస్ట్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు జావెద్ మియాందాద్, హనీఫ్ మొహమ్మద్‌లు ఈ ఘనత సాధించారు. ఇక లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి పాక్ ఓపెనర్‌గానూ అబ్దుల్లా షఫీక్ చరిత్రకెక్కాడు. A true champion knock 🔥❤️ 200 hundred from @imabd28 #SLvPAK #SLvsPAK #AbdullahShafique pic.twitter.com/c2m4ldK3m8 — Mir kashi👑 (@oya_kojuu) July 26, 2023 ఇక రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన పాక్ సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 458 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్‌కు(200 నాటౌట్) అగా సల్మాన్(80 బంతుల్లో 70 బ్యాటింగ్) చక్కగా సహకరిస్తున్నాడు. ఆశితో ఫెర్నాండో మూడు వికెట్లు తీయగా.. ప్రభాత్ జయసూరియా ఒక వికెట్ పడగొట్టాడు. ఇప్పటివరకు పాకిస్తాన్ 292 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడం.. వరుణుడు అడ్డుపడకపోతే మాత్రం పాకిస్తాన్ విజయాన్ని ఆపడం లంకకు కష్టసాధ్యమనే చెప్పొచ్చు. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది.ధనుంజయ డిసిల్వా 57, దినేశ్ చండిమల్ 34 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా మూడు, షాహిన్ అఫ్రిది ఒక వికెట్ తీశాడు. 🌟 First visiting opener to score a double 💯 at SSC, Colombo 🌟 Third-youngest double-centurion for 🇵🇰 after Javed Miandad and Hanif Mohammad@imabd28 scores a magnificent maiden double ton 🙌#SLvPAK pic.twitter.com/3zGaD0pnKl — Pakistan Cricket (@TheRealPCB) July 26, 2023 Maiden Double Hundred - Take a bow, Abdullah Shafique! 🌟 He is now the third youngest Pakistan batter to score a Test double ton after Javed Miandad and Hanif Mohammad 💯👌#CricketTwitter #SLvPAK #WTC25 #PakBall #abdullahshafique pic.twitter.com/QvRxprwC7J — CricWick (@CricWick) July 26, 2023 చదవండి: Saud Shakeel: అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టి.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు! Abdullah Shafique: సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్.. భారీ ఆధిక్యం దిశగా -
రెండు ఇన్నింగ్స్‌లలోనూ డబుల్ సెంచరీలు
కొలంబో: ఫస్ట్ క్లాస్ క్రికెట్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో కనిష్క పెరీరా అరుదైన రికార్డును నమోదు చేశాడు. లంక దేశవాళీ టోర్నీలో భాగంగా జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో పెరీరా రెండు ఇన్నింగ్స్‌లలోనూ రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. లంక క్రికెట్లో రెండు పటిష్ట జట్లు సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, ఎన్సీసీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. ఎన్సీసీ జట్టుకు కెప్టెన్ అయిన ఏంజెలో తొలి ఇన్నింగ్స్‌లో 203 బంతుల్లో 201 పరుగులు... రెండో ఇన్నింగ్స్‌లో 268 బంతుల్లో 231 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ చరిత్రలో ఈ ఫీట్ రెండో సారి మాత్రమే నమోదు కావడం విశేషం. దాదాపు 81 ఏళ్ల క్రితం 1938లో కెంట్ బ్యాట్స్‌మన్ ఆర్థర్ ఫాగ్ ఇదే తరహాలో 244, 202 నాటౌట్ పరుగులు చేశాడు. శ్రీలంక తరఫున 4 వన్డేలు, 2 టి20లు ఆడిన 28 ఏళ్ల ఏంజెలో 2016 ఆగస్టులో జట్టులో స్థానం కోల్పోయాడు. -
హెరాత్ విజృంభణ
- పాక్ తొలి ఇన్నింగ్స్ 244/6 - శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 320 కొలంబో: శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగన హెరాత్ (5/98) ధాటికి పాకిస్థాన్ టాప్ ఆర్డర్ కకావికలమైంది. ఫలితంగా సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు శుక్రవారం మిస్బా సేన 70 ఓవర్లలో ఆరు వికెట్లకు 244 పరుగులు చేసింది. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (85 బంతుల్లో 58; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... చివర్లో వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (81 బంతుల్లో 66 బ్యాటింగ్; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అసద్ షఫీఖ్ (90 బంతుల్లో 42; 2 ఫోర్లు), అజహర్ అలీ (77 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడారు. హెరాత్ దెబ్బకు ఓ దశలో 140 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన పాక్‌ను అసద్, సర్ఫరాజ్ ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు వీరు 93 పరుగులు జోడించారు. టాప్ ఆర్డర్లో వరుసగా ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లో ఐదుగురిని పెవిలియన్‌కు పంపిన హెరాత్ తన టెస్టు కెరీర్లో 250 వికెట్ల మైలురాయిని దాటాడు. ఇది శ్రీలంక తరఫున మూడో అత్యుత్తమ రికార్డు. గతంలో మురళీధరన్ (800), వాస్ (355) ఉన్నారు. అంతకుముందు 261/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన లంక లంచ్ విరామానికి కొద్ది ముందు 99.3 ఓవర్లలో 320 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జునైద్ ఖాన్‌కు ఐదు, వహాబ్ రియాజ్‌కు మూడు వికెట్లు దక్కాయి. -
శ్రీలంక 261/8
తరంగ సెంచరీ మిస్ పాక్‌తో రెండో టెస్టు కొలంబో: సీనియర్ బ్యాట్స్‌మన్ మహేల జయవర్ధనే చివరి టెస్టులో శ్రీలంక జట్టు ఎదురీదుతోంది. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో పాకిస్థాన్‌తో జరుగుతున్న ఈ రెండో టెస్టులో లంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 261 పరుగులు చేసింది. ఓపెనర్ ఉపుల్ తరంగ (179 బంతుల్లో 92; 12 ఫోర్లు) కొద్దిలో సెంచరీ కోల్పోగా... మరో ఓపెనర్ సిల్వ (106 బంతుల్లో 41; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 79 పరుగులు జోడించింది. మిడిలార్డర్లో కెప్టెన్ మాథ్యూస్ (86 బంతుల్లో 39; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. జునైద్ ఖాన్‌కు నాలుగు, వహాబ్ రియాజ్‌కు మూడు వికెట్లు పడ్డాయి. జయవర్ధనే విఫలం ఇక సొంత మైదానంలో కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్న జయవర్ధనే కేవలం నాలుగు పరుగులు చేసి నిరాశపరిచాడు. అంతకుముందు తమ ఆరాధ్య క్రికెటర్‌కు ఘన వీడ్కోలు చెప్పేందుకు స్టేడియంలో అభిమానులు కటౌట్లు ఏర్పాటు చేశారు. తను చుదువుకున్న కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక స్టాండ్‌లో కూర్చున్నారు. 37 ఏళ్ల ఈ క్రికెటర్ క్రీజులోకి వస్తున్న సమయంలో పాక్ ఆటగాళ్లు వరుసగా నిలబడి ఆహ్వానం పలుకగా 3 వేల మంది ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో స్వాగతించారు.