కొలంబో: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో కనిష్క పెరీరా అరుదైన రికార్డును నమోదు చేశాడు. లంక దేశవాళీ టోర్నీలో భాగంగా జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో పెరీరా రెండు ఇన్నింగ్స్‌లలోనూ రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. లంక క్రికెట్‌లో రెండు పటిష్ట జట్లు సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, ఎన్‌సీసీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. ఎన్‌సీసీ జట్టుకు కెప్టెన్ అయిన ఏంజెలో తొలి ఇన్నింగ్స్‌లో 203 బంతుల్లో 201 పరుగులు... రెండో ఇన్నింగ్స్‌లో 268 బంతుల్లో 231 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ చరిత్రలో ఈ ఫీట్ రెండో సారి మాత్రమే నమోదు కావడం విశేషం. దాదాపు 81 ఏళ్ల క్రితం 1938లో కెంట్ బ్యాట్స్‌మన్ ఆర్థర్ ఫాగ్ ఇదే తరహాలో 244, 202 నాటౌట్ పరుగులు చేశాడు. శ్రీలంక తరఫున 4 వన్డేలు, 2 టి20లు ఆడిన 28 ఏళ్ల ఏంజెలో 2016 ఆగస్టులో జట్టులో స్థానం కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment