ఔరంగాబాద్:మహిళా క్రికెట్ మరో సంచలనం నమోదైంది. అండర్-19 వన్డే క్రికెట్ టోర్నమెంట్ లో 16 ఏళ్ల ముంబై క్రీడాకారిణి జెమిమాహ్ రోడ్రిగ్జ్ డబుల్ సెంచరీతో అదరగొట్టింది. తద్వారా అండర్-19 మహిళా వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత క్రీడాకారిణిగా రోడ్రిగ్జ్ నిలిచింది. ఔరంగాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన 50 ఓవర్ల మ్యాచ్ లో ముంబై తరపున బరిలోకి దిగిన రోడ్రిగ్జ్ ద్విశతకాన్ని సాధించింది. 163 బంతుల్లో 202 పరుగులతో దుమ్ములేపింది. 52 బంతుల్లో 53 పరుగులు చేసి నెమ్మదిగా బ్యాటింగ్ కొనసాగించిన రోడ్రిగ్జ్.. 83 బంతుల్లో శతకం నమోదు చేసింది. ఆపై దూకుడుగా ఆడిన ఆమె డబుల్ సెంచరీ చేసి అజేయంగా నిలిచింది.
ఫలితంగా మహిళా అండర్ -19 వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత క్రీడాకారిణిగా రోడ్రిగ్జ్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. గతంలో స్మృతి మందన 224 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. 2013లో జరిగిన మందన సాధించిన డబుల్ సెంచరీనే అండర్ 19లో తొలి ద్విశతకం.
Comments
Please login to add a commentAdd a comment