కౌంటీ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2 పోటీల్లో భాగంగా ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ ఆటగాడు లూయిస్ కింబర్ కేవలం 100 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డైంది.
గతంలో (2016) ఈ రికార్డు గ్లామోర్గన్ ఆటగాడు అనెరిన్ డొనాల్డ్ పేరిట ఉండేది. డొనాల్డ్ డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 123 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. తాజాగా డొనాల్డ్ రికార్డును కింబర్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కింబర్ 127 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 21 సిక్సర్ల సాయంతో 243 పరుగులు చేశాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో రెండో వేగవంతమైన డబుల్ సెంచరీ..
ససెక్స్‌పై కింబర్ చేసిన డబుల్ సెంచరీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే రెండో వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డైంది. ఈ ఫార్మాట్‌లో వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు షఫీగుల్లా పేరిట ఉంది. షఫీగుల్లా 2018లో కాబుల్ రీజియన్ తరఫున ఆడుతూ బూస్ట్ రీజియన్‌పై కేవలం 89 బంతుల్లోనే డబుల్ బాదాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో టాప్-5 వేగవంతమైన డబుల్ సెంచరీలు..
షఫీగుల్లా - 89 బంతులు, కాబూల్ రీజియన్ vs బూస్ట్ రీజియన్, 2018
లూయిస్ కింబర్ - 100 బంతులు, లీసెస్టర్‌షైర్ vs ససెక్స్, 2024
తన్మయ్ అగర్వాల్ - 119 బంతులు, హైదరాబాద్ vs అరుణాచల్, 2024
రవిశాస్త్రి - 123 బంతులు, బాంబే vs బరోడా, 1985
అనెరిన్ డోనాల్డ్ - 123 బంతులు, గ్లామోర్గాన్ vs డెర్బీషైర్, 2016
ఈ మ్యాచ్‌లో కింబర్ మరో ఆల్ టైమ్ కౌంటీ క్రికెట్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కింబర్ కొట్టిన సిక్సర్లు (21) కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లుగా రికార్డయ్యాయి. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ ప్రస్తుత టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (17 సిక్సర్లు) పేరిట ఉంది.
కౌంటీ క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన టాప్-4 ఆటగాళ్లు..
21 - లూయిస్ కింబర్ vs ససెక్స్, 2024
17 - బెన్ స్టోక్స్ vs వోర్సెస్టర్‌షైర్, 2022
16 - ఆండ్రూ సైమండ్స్ vs గ్లామోర్గాన్, 1995
16 - గ్రాహం నేపియర్ vs సర్రే, 2011
ఈ మ్యాచ్‌లో మరో ఆల్‌టైమ్ కౌంటీ రికార్డు కూడా నమోదైంది. ససెక్స్ బౌలర్ ఓలీ రాబిన్సన్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఆల్‌టైమ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రాబిన్సన్ ఓ ఓవర్‌లో ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు.
కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న టాప్-3 బౌలర్లు...
ఓలీ రాబిన్సన్- 43 పరుగులు- 2024
అలెక్స్ ట్యూడర్- 38 పరుగులు- 1998
షోయబ్ బషీర్- 38 పరుగులు- 2024
ఈ మ్యాచ్‌లో కింబర్ మెరుపు డబుల్ సెంచరీతో విరుచుకుపడినా అతని జట్టు లిసెస్టర్‌షైర్ ఓటమిపాలవడం కొసమెరుపు. 464 పరుగుల లక్ష్య ఛేదనలో లీసెస్టర్‌షైర్ 446 పరుగులకే ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment