
హామిల్టన్: కెప్టెన్ కేన్ విలియమ్సన్ (257 బంతుల్లో 200 నాటౌట్; 19 ఫోర్లు) అజేయ డబుల్ సెంచరీ బాదడంతో... బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 715/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ టెస్టు చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. 2014లో పాకిస్తాన్‌పై చేసిన 690 పరుగులే ఇప్పటివరకు దాని అత్యుత్తమం. దీంతోపాటు ప్రత్యర్థిపై తమ టెస్టు చరిత్రలోనే అత్యధికంగా 481 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.
451/4తో మూడో రోజు శనివారం ఆట కొనసాగించిన కివీస్‌ను విలియమ్సన్... వాగ్నర్ (47), వాట్లింగ్ (31), గ్రాండ్‌హోమ్ (76 నాటౌట్) తోడుగా ముందుకు నడిపించాడు. విలియమ్సన్ డబుల్ సెంచరీ పూర్తికాగానే కివీస్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (39 బ్యాటింగ్), కెప్టెన్ మహ్మూ దుల్లా (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment