ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు | Chad Bowes Smashes Fastest Ever Double Century In List A Cricket | Sakshi
Sakshi News home page

ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు

Published Wed, Oct 23 2024 10:11 AM | Last Updated on Wed, Oct 23 2024 1:06 PM

Chad Bowes Smashes Fastest Ever Double Century In List A Cricket

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో (50 ఓవర్ల ఫార్మాట్‌) ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ నమోదైంది. న్యూజిలాండ్‌లో జరిగే ఫోర్డ్‌  ట్రోఫీలో క్యాంటర్‌బరీ ఆటగాడు చాడ్‌ బోవ్స్‌ 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో డబుల్‌ సెంచరీ బాదాడు. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో బోవ్స్‌ ఈ ఘనత సాధించాడు. 

ఈ మ్యాచ్‌కు ముందు లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు ట్రవిస్‌ హెడ్‌, ఎన్‌ జగదీశన్‌ పేరిట ఉండేది. వీరిద్దరూ 114 బంతుల్లో డబుల్‌ సాధించారు. తాజాగా బోవ్స్‌.. హెడ్‌ (సౌత్‌ ఆస్ట్రేలియా), జగదీశన్‌ (తమిళనాడు) రికార్డును బద్దలు కొట్టాడు. 

బోవ్స్‌ ఈ మ్యాచ్‌లో మరో ఘనత కూడా సాధించాడు. న్యూజిలాండ్‌ లిస్ట్‌-ఏ చరిత్రలో రెండో అత్యధిక​ స్కోర్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 110 బంతులు ఎదుర్కొని 205 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌ లిస్ట్‌-ఏ చరిత్రలో అత్యధిక స్కోర్‌ రికార్డు జేమీ హౌ (222) పేరిట ఉంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. బోవ్స్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాంటర్‌బరీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఒటాగో 103 పరుగులకే ఆలౌటై 240 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 

చదవండి: న్యూజిలాండ్‌ టీమ్‌కు కొత్త కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement