
చట్టోగ్రామ్: టెస్టు క్రికెట్ చరిత్రలో మరో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. బంగ్లాదేశ్తో చట్టోగ్రామ్ లో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ విధించిన 395 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా విండీస్ గెలుపులో మొత్తం క్రెడిట్ కైల్ మేయర్స్‌దే అని చెప్పాలి. అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టడమేగాక ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తం 310 బంతులు ఎదుర్కొన్న మేయర్స్ 201 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన కైల్ మేయర్స్ పలు అరుదైన రికార్డులు సాధించాడు.
►అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించిన 6వ ఆటగాడిగా.. రెండో విండీస్ ఆటగాడిగా రికార్డు.
► ఇంతకముందు గ్రీనిడ్జ్ అరంగేట్రం టెస్టులో డబుల్ సెంచరీ చేసిన తొలి విండీస్ ఆటగాడు.
►టెస్టు మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన వారిలో 6వ స్థానం.
► అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు సాధించిన జాబితాలో 5వ స్థానం.
చేజింగ్ రికార్డులు:
►విండీస్ చేధించిన 395 పరుగుల విజయలక్ష్యం అత్యధిక చేదనల్లో ఆరో స్థానంలో నిలిచింది.
►395 పరుగులు లక్ష్యాన్ని చేధించిన విండీస్ .. ఆసియా గడ్డపై అత్యధిక చేదనల్లో తొలి స్థానం.
చదవండి:
ఏంటి పంత్.. ఈసారి కూడా అలాగేనా!
భారత్‌కు ఫాలోఆన్ గండం తప్పేనా!
Comments
Please login to add a commentAdd a comment