
డబ్లిన్: మహిళా క్రికెట్‌లో మరో సంచలనం నమోదయింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ క్రీడాకారిణులు రికార్డుల మోత మోగిస్తున్నారు. తొలి వన్డేలో 490 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పగా, తాజాగా నామమాత్రమైన మూడో వన్డేలో అమిలియా కెర్ డబుల్ సెంచరీ(232; 145 బంతుల్లో 31 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించటంతో పలు రికార్డులు తిరగరాశారు.
మహిళా క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించడంతో పాటు, అతి చిన్న వయసులోనే(17 సంవత్సరాల 243 రోజులు) ఈ రికార్డు సాధించిన ప్లేయర్‌గా సంచలనం సృష్టించారు. కాగా ఇప్పటివరకు మహిళా క్రికెట్‌లో ఇది రెండో ద్విశతకం మాత్రమే, మొదటి డబుల్ సెంచరీ ఆస్ట్రేలియా క్రీడాకారిణి బెలిందా క్లార్క్(229) సాధించారు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ వన్డే చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన ఏడో వ్యక్తిగా (రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు) అమిలియా కెర్ ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment