
వసీం జాఫర్
నాగ్‌పూర్: వయసు మీద పడుతున్నా క్రికెట్‌లో విశేషంగా రాణిస్తూ రికార్డులు మోత మోగిస్తున్నాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ వసీం జాఫర్. ఇరానీ కప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ ఆటగాడు జాఫర్ డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా క్రికెట్ చరిత్రలో 40 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా జాఫర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
అదే సమయంలో లేటు వయసులో 250కి పైగా పరుగులు సాధించిన తొలి ఆసియా క్రికెటర్‌గా జాఫర్ గుర్తింపు సాధించాడు. బుధవారం తొలి రోజు ఆటలో 53 సెంచరీ సాధించిన జాఫర్.. దాన్ని ఈరోజు డబుల్ సెంచరీగా మలుచుకున్నాడు.