
నాగ్‌పూర్: వసీం జాఫర్ (113 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో చెలరేగడంతో రెస్టాఫ్ ఇండియాతో బుధవారం మొదలైన ఇరానీ కప్ మ్యాచ్‌లో రంజీ చాంపియన్ విదర్భ తొలి రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
కెప్టెన్ ఫైజ్ ఫజల్ (89; 6 ఫోర్లు, 1 సిక్స్), సంజయ్ రామస్వామి (53; 6 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 101 పరుగులు జతచేశారు. సంజయ్ అవుటయ్యాక క్రీజులోకొచ్చిన జాఫర్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 40 ఏళ్ల జాఫర్ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 53వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అశ్విన్ (25–1–66–1) ఆఫ్ స్పిన్‌ను పక్కన పెట్టి లెగ్‌బ్రేక్ ప్రయత్నించినా లాభం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment