హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 145 బంతులను ఎదుర్కొన్న గిల్.. 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో తొలిసారి ఈ ఫీట్ (డబుల్ సెంచరీ) సాధించిన గిల్ హ్యాట్రిక్ సిక్సర్లతో 200 మార్క్‌ను చేరుకున్నాడు. డబుల్ సెంచరీ సాధించే క్రమంలో గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటంటే..
- అత్యంత పిన్న వయసులో (23 ఏళ్ల 132 రోజులు) డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు. ఇంతకుముందు ఈ రికార్డు ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉండేది.
- హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అత్యధిక స్కోర్ రికార్డు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (2009లో ఆసీస్‌పై 175 పరుగులు) పేరిట ఉండేది.
- ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరర్ (గిల్, 208), రెండో అత్యధిక స్కోరర్ (రోహిత్, 34) మధ్య రన్స్ గ్యాప్ రికార్డు. ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 264 పరుగులు చేసిన మ్యాచ్‌లో రెండో అత్యధిక స్కోరర్‌గా విరాట్ కోహ్లి (66) ఉన్నాడు. వీరిద్దరి మధ్య 198 పరుగుల తేడా ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గిల్, రోహిత్‌ల మధ్య 174 పరుగుల తేడాతో ఉంది. రన్స్ గ్యాప్ రికార్డ్స్ జాబితాలో గిల్‌ది మూడో స్థానం.
- వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్. గతంలో ఈ రికార్డు సచిన్ (186 నాటౌట్) పేరిట ఉండేది.
- వరుస వన్డే ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, డబుల్ సెంచరీతో పాటు హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన ఘనత.
- అతి తక్కువ వన్డేల్లో (19) 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధవన్ (17) తర్వాతి స్థానం.
- వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్‌ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డు. ఈ రికార్డు పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ (18) పేరిట ఉంది.
- భారత్ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు. విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ (24 మ్యాచ్‌లు) సంయుక్తంగా రెండో ప్లేస్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment