వన్డేలో (50 ఓవర్ల మ్యాచ్) డబుల్ సెంచరీ కొడితే ఆశ్చర్యపోతాం. అలాంటిది 40 ఓవర్ల మ్యాచ్‌లోనే ఓ క్రికెటర్ డబుల్ సెంచరీబాదితే...
స్కూల్ క్రికెట్‌లో హైదరాబాద్ కుర్రాడి ఘనత
సాక్షి, హైదరాబాద్: వన్డేలో (50 ఓవర్ల మ్యాచ్) డబుల్ సెంచరీ కొడితే ఆశ్చర్యపోతాం. అలాంటిది 40 ఓవర్ల మ్యాచ్‌లోనే ఓ క్రికెటర్ డబుల్ సెంచరీబాదితే... కచ్చితంగా అది అద్భుతమే. హైదరాబాద్‌లోని ఓ స్కూల్ పిల్లాడు ఈ ఘనత సాధించాడు. బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నీలో... డీఆర్‌ఎస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేంద్రీయ విద్యాలయ (కేవీ) జట్టుకు చెందిన కృష్ణకాంత్ తివారి (200) అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీ చేశాడు. కృష్ణకాంత్ జోరుతో కేవీ జట్టు 40 ఓవర్లలో 8 వికెట్లకు 334 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత డీఆర్‌ఎస్ జట్టు 18.3 ఓవర్లలో కేవలం 52 పరుగులకే ఆలౌటయింది. దీంతో కేవీ జట్టు 282 పరుగుల భారీతేడాతో గెలిచింది.