వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 101 ఓవర్ వేసిన స్పిన్నర్ బషీర్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాది జైశ్వాల్ తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
జైశ్వాల్‌కు తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే తొలి ద్విశతకం కావడం విశేషం. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట జైశ్వాల్ తన అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 290 బంతుల్లో 209 పరుగులు చేసి జైశ్వాల్ ఔటయ్యాడు.
అండర్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను జైశ్వాల్ కోల్పోయాడు.108 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.
DOUBLE CENTURY BY YASHASVI JAISWAL...!!!! 🔥
— 𝐕𝐈𝐑𝐀𝐓𝕏𝐑𝐂𝐁 (@ProfKohli18) February 3, 2024
Monster innings #INDvsENG #INDvsENGTest #YashasviJaiswal pic.twitter.com/vK8IVGfZiZ
Comments
Please login to add a commentAdd a comment