చరిత్ర సృష్టించిన "లేడీ సెహ్వాగ్‌".. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! వీడియో | Shafali Varma scores fastest double century in Womens Tests | Sakshi
Sakshi News home page

IND vs SA: చరిత్ర సృష్టించిన "లేడీ సెహ్వాగ్‌".. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! వీడియో

Published Fri, Jun 28 2024 4:31 PM | Last Updated on Fri, Jun 28 2024 5:44 PM

Shafali Varma scores fastest double century in Womens Tests

చెపాక్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రుగుతున్న ఏకైక టెస్టులో భార‌త ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ చ‌రిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగింది. టెస్టు క్రికెట్ అన్న విషయం మర్చిపోయిన షఫాలీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. 

సౌతాఫ్రికా బౌలర్లకు వర్మ చుక్కలు చూపించింది. షఫాలీ బౌండరీల వర్షం కురిపించింది. ఈ క్రమంలో కేవలం 194 బంతుల్లోనే తన తొలి డబుల్ సెంచరీ మార్క్‌ను షఫాలీ అందుకుంది. వరుసగా సిక్స్‌లు బాదుతూ  షఫాలీ తన స్టైల్లో ద్విశతకం నమోదు చేసింది. 

ఓవరాల్‌గా 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్‌లతో 205 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరింది. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో షఫాలీ వర్మ వెనుదిరిగింది. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన ఈ లేడీ సెహ్వాగ్‌.. పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.

షఫాలీ సాధించిన రికార్డులు ఇవే..
మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా ష‌ఫాలీ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సదర్లాండ్ 256 బంతుల్లో ద్విశతకం నమోదు చేసింది. 

తాజా మ్యాచ్‌లో కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసిన వర్మ.. అన్నాబెల్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. అదేవిధంగా టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది. షఫాలీ కంటే ముందు భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్ టెస్టుల్లో ద్విశతకం నమోదు చేసింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement