కింగ్‌స్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. టెస్టుల్లో అతడికి ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. 373 బంతులు ఎదర్కొన్న లాథమ్ 34 ఫోర్లు, 2 సిక్స్‌లతో 252 పరుగులు సాధించాడు. ఇక న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 521-6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
లాథమ్‌తో పాటు కాన్వే కూడా సెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయగల్గింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్(252), కాన్వే (109), బ్లండల్(57) పరుగులతో టాప్ స్కోరర్‌లు గా నిలిచారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాస్కిన్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా, షారిఫుల్ ఇస్లాం ఒక వికెట్ సాధించాడు. ఇక తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి విజయంతో ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది.
చదవండి: IND Vs SA 3rd Test: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment