రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీ, ఆసీస్ టార్గెట్ 384
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారమిక్కడ జరుగుతున్న ఏడవ ‘ఫైనల్’ వన్డేలో మరోసారి భారత్ దీపావళి టపాసు గట్టిగానే పేలింది. భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసి ఆసీస్‌కు 384 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ముందుంచింది. ఈ సిరిస్‌లో ఓపెనర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తనదైనా శైలిలో ధీటుగా ఆడుతూ 158 బంతుల్లో 12ఫోర్లు, 16 సిక్స్‌లతో 209 పరుగుల అధ్బుతమైన ఇన్నింగ్ ఆడి తొలి డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన.. మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఆసీస్ వేసిన చెత్తబంతులను ఆడిందే తడువుగా వచ్చిన బంతి వచ్చినట్టుగా రోహిత్ బౌండరీలను దాటించాడు. రోహిత్ శర్మ ఆది నుంచి నిలకడగా రాణిస్తూ తన బ్యాటింగ్‌తో విమర్శకులను సైతం అబ్బురపరిచాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రోహిత్ శర్మ క్రికెట్ అభిమానులకు మంచి `దీపావళి ధమాకా` అందించాడు.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత ఓపెనర్ శేఖర్ ధావన్, రోహిత్ శర్మ భాగస్వామ్యంతో భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. శేఖర్ ధావన్ అదేరీతిలో మెరుపువేగంతో దూకుడుగా ఆడుతూ పరుగుల పటాసులు పేల్చాడు. ధావన్ 57 బంతుల్లో 9ఫోర్లతో 60 పరుగులు చేసి చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. అంతలో దోహిర్తి బౌలింగ్‌లో ఎల్‌బిడబ్య్లూ తో పెవిలీయన్‌కు వెళ్లక తప్పలేదు. శేఖర్ ధావన్ ఔట్ కావడంతో వీరాట్ కోహ్లి రంగప్రవేశం చేశాడు. పరుగు తీసేందుకు విపలయత్నం చేశాడు. దీంతో కోహ్లి కూడా పెవిలీయన్ బాట పట్టాడు.
ఆ తరువాత వచ్చిన ఆటగాళ్లు వరుసుగా సురేష్ రైనా (30బంతుల్లో 2 ఫోర్లుతో) 28 పరుగులు, యువరాజ్ సింగ్ (14బంతుల్లో 1 సిక్స్‌తో) 12 పరుగులకే పరిమితమైయ్యారు. వీరిద్దరి టాపాసులు ఒకరితరువాత ఒకరివి క్రీజులో వరుసుగా తుస్సుమన్నాయి. అప్పటికే ఆరంభం నుంచి విజయుడై దూసుకెళ్తున్న రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తూ తన బ్యాటింగ్‌తో ఆసీస్ జట్టుకు చుక్కలు చూపించాడు. రోహిత్‌కు తోడుగా బరిలోకి దిగిన భారత్ కెప్టెన్ ధోనీ (38బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్) 62 పరుగులు చేసి ఔటైయ్యాడు. అయితే ఆసీస్ బౌలర్ మెకె బౌలింగ్‌లో హెన్రిక్యివ్స్ క్యాచ్ పట్టుకోవడంతో రోహిత్ ఔట్ కాగా, ధోనీ రన్ ఔట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లు మెకె, పల్కనర్ తలో వికెట్ తీసుకోగా, దొహర్తీ 2 వికెట్లు తీసుకున్నాడు.
అంతకముందు టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ భారత్‌పై ప్రతికారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వరుణుడు సహాకరించలేదు. ఈ సిరీస్ విజేతను నిర్దేశించే మ్యాచ్ కావడంతో రెండు జట్లూ నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. కాగా, నాగ్‌పూర్‌లో భారీ స్కోరు చేసినా మ్యాచ్‌ను ఆసీస్ చేజార్చుకున్న విషయం తెలిసిందే.