లక్నో: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ 31 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అఫ్గానిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 43.1 ఓవర్లలో 120 పరుగులకే చాపచుట్టేసింది.. ఓపెనర్ జావెద్ అహ్మదీ(62) మినహా అంతా నిరాశపరిచారు. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, రాకిమ్ కార్న్‌వాల్, రోస్టన్ ఛేజ్‌లు తలో మూడు వికెట్లు సాధించి అఫ్గాన్ పతనాన్ని శాసించారు. మూడో రోజు ఆటలో హోల్డర్ మూడు వికెట్లు సాధించి అఫ్గాన్‌ను దెబ్బ కొట్టాడు. అంతకుముందు వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది.
బ్రూక్స్(111) సెంచరీ సాధించడంతో పాటు క్యాంప్‌బెల్(55) మెరవడంతో విండీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అదే సమయంలో అఫ్గాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే విండీస్ కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా రాకిమ్ కార్న్‌వాల్ 10 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించిన రాకిమ్.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో మెరిశాడు. తద్వారా ఒక టెస్టులో 10 వికెట్లు సాధించిన ఏడో విండీస్ స్పిన్నర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment