లక్నో: ప్రపంచ క్రికెట్‌లో భారీ స్థూలకాయ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ స్పిన్నర్ రాకిమ్ కార్న్‌వాల్ అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో తన స్పిన్ మ్యాజిక్ రుచిని చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించిన రాకిమ్.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి రాకిమ్ మొత్తంగా 10 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా విదేశాల్లో ఆడే టెస్టుల్లో పది అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఏడో వెస్టిండీస్ స్పిన్నర్‌గా గుర్తింపు సాధించాడు. మరొకవైపు ఆడుతున్న రెండో టెస్టులోనే 10 వికెట్లను సాధించిన స్పిన్నర్‌గా నిలిచాడు.
అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకు ఆలౌట్ కావడంలో రాకిమ్ కీలక పాత్ర పోషించాడు. ఏడు వికెట్లు సాధించి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత గురువారం రెండో రోజు ఆటలో వెస్టిండీస్ 277 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షామరాహ్ బ్రూక్స్(111) తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు. దాంతో వెస్టిండీస్ 90 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్గానిస్తాన్ ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేసింది. రాకిమ్ మూడు వికెట్లకు జతగా, రోస్టన్ ఛేజ్ మూడు వికెట్లతో రాణించాడు.భద్రతపరమైన ఇబ్బందుల వల్ల అఫ్గానిస్తాన్ తమ మ్యాచ్‌లను స్వదేశంలో కాకుండా భారత్‌లో ఆడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment