కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ ఆల్ రౌండర్, విండీస్ బహుబలి రఖీమ్ కార్న్‌వాల్ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో భాగంగా సెయింట్ కిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకంతో కార్న్‌వాల్ చెలరేగాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు.
సీపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా కార్న్‌వాల్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 48 బంతులు ఎదుర్కొన్న కార్న్‌వాల్ 12 సిక్స్‌లు, 4 ఫోర్లతో 102 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. టీ20 క్రికెట్‌లో కార్న్‌వాల్‌కు ఇదే తొలి సెంచరీ.
బార్బడోస్ రాయల్స్ ఘన విజయం..
ఇక ఈ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్‌పై 8 వికెట్ల తేడాతో బార్బడోస్ రాయల్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సెయింట్ కిట్స్ బ్యాటర్లలో ఫ్లెచర్(56), విల్ స్మిద్(63), రుథర్‌ఫర్డ్(65) పరుగులతో అదరగొట్టారు.
బార్బోడస్ బౌలర్లలో కార్నవాల్ రెండు వికెట్లు,బ్రాత్‌వైట్ ఒక్క వికెట్ పడగొట్టారు. అనంతరం 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. బార్బడోస్ బ్యాటర్లలో కార్న్‌వాల్‌తో పాటు కెప్టెన్ పావెల్(49) పరుగులతో అదరగొట్టాడు.
చదవండి: Asia cup 2023: నేపాల్‌తో మ్యాచ్‌కూ వర్షం గండం.. రద్దయితే టీమిండియా పరిస్థితేంటి..?
Wait for the bat drop 🔥
— ESPNcricinfo (@ESPNcricinfo) September 4, 2023
(via @CPL) pic.twitter.com/3SbYJCnZW6
It was never in doubt, the Republic Bank Play of the Day is Rahkeem Cornwall's sensational century.#CPL23 #BRvSKNP #RepublicBank #CricketPlayedLouder #BiggestPartyInSport #Cornwall pic.twitter.com/ELvirLOtZk
— CPL T20 (@CPL) September 4, 2023
Comments
Please login to add a commentAdd a comment