కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెయింట్ లూసియా కింగ్స్ తమ మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రాస్ ఐలెట్ వేదికగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సెయింట్ కిట్స్ బ్యాటర్లలో ఆండ్రీ ఫ్లెచర్(62), రూసో హాఫ్ సెంచరీలతో మెరిశారు. సెయింట్ లూసియా బౌలర్లలో ఆల్జారీ జోషఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఛేజ్, వీస్, సద్రక్ తలా వికెట్ సాధించారు.
డుప్లెసిస్ ఊచకోత..
అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని సెయింట్ లూసియా కింగ్స్ 16.3 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్, జాన్సెన్ చార్లెస్ విధ్వంసం సృష్టించారు.
ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశారు. చార్లెస్ 42 బంతుల్లో 4ఫోర్లు, 7 సిక్స్‌లతో 74 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లలో హసరంగా,క్లార్క్‌సన్ తలా రెండు వికెట్లు సాధించారు.
కాగా డుప్లెసిస్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పాయింట్ల పట్టిక విషయానికి వస్తే.. గయానా ఆమెజాన్ వారియర్స్ తొలి స్ధానంలో ఉండగా.. సెయింట్ లూసియా మూడో స్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: అంతా అనుకున్నట్టే జరిగింది.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు
— Cricket Cricket (@cricket543210) September 13, 2024
Comments
Please login to add a commentAdd a comment