మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023)లో టెక్సస్ సూపర్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం తెల్లవారుజామున(భారత కాలమాన ప్రకారం) ముంబై న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో టెక్సస్ సూపర్ కింగ్స్ 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో సీఎస్‌కే తరపున అదరగొట్టిన డెవాన్ కాన్వే మేజర్ లీగ్ క్రికెట్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేస్తున్నాడు.
తాజాగా ముంబై న్యూయార్క్‌తో మ్యాచ్‌లో కాన్వే 55 బంతుల్లో 74 పరుగులతో రాణించాడు. మిచెల్ సాంట్నర్(27 పరుగులు) మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో టెక్సస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ముంబై న్యూయార్క్ బౌలర్లలో బౌల్ట్, రబాడలు చెరో రెండు వికెట్లు తీయగా.. కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ షయాన్ జాహంగీర్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టిమ్ డేవిడ్ 24 పరుగులు చేశాడు. టెక్సస్ సూపర్‌కింగ్స్ బౌలర్లలో మహ్మద్ మోషిన్, డేనియల్ సామ్స్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. రస్టీ థెరాన్, జియా ఉల్ హక్, డ్వేన్ బ్రావోలు తలా ఒక వికెట్ తీశారు.
DEVON CON-do no wrong 🤩 🎉 Bow down to today's Player of the Match!!! 💛 #MajorLeagueCricket | @texassuperkings pic.twitter.com/OPbaXJBwPZ
— Major League Cricket (@MLCricket) July 18, 2023
చదవండి: CWG 2026: 'అంత బడ్జెట్ మావల్ల కాదు'.. కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహించలేం
Comments
Please login to add a commentAdd a comment