Texas Super Kings
-
రాణించిన కాన్వే.. సూపర్ కింగ్స్‌ను గెలిపించిన డుప్లెసిస్
మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (జులై 25) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఫాఫ్ మరో అర్ద సెంచరీ బాదాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయార్క్‌పై ఘన విజయం సాధించింది.FAF DU PLESSIS - THE LEGEND OF THE SUPER KINGS FAMILY. ⭐- 72 (47) with 6 fours and 3 sixes in the Eliminator against MI New York in the MLC. The captain at the age of 40 keeps getting better. 👌pic.twitter.com/GrURm0QS7U— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2024రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. రషీద్ ఖాన్ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఎంఐ ఇన్నింగ్స్‌లో రషీద్‌తో పాటు మెనాంక్ పటేల్ (48), షయాన్ జహంగీర్ (26) మాత్రమే రాణించారు. సూపర్‌కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్, ఆరోన్ హార్డీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జియా ఉల్ హక్, నూర్ అహ్మద్, బ్రావో తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (72), డెవాన్ కాన్వే (43 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), సత్తా చాటడంతో అలవోకగా (18.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) విజయం సాధించింది. బంతితో రాణించిన ఆరోన్ హార్డీ బ్యాట్‌తోనూ (22 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్‌కు అర్హత సాధించగా.. ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. రేపు జరుగబోయే క్వాలిఫయర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడం, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ పోటీపడతాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్ ఆడతుంది. క్వాలిఫయర్ విజేత, ఛాలెంజర్ గేమ్ విజేత జులై 28న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఎంఎల్సీ 2024లో డుప్లెసిస్ స్కోర్లు..14(14), 100(58), 34(17), 61(38), 55(32), 39(17), 72(47)7 ఇన్నింగ్స్‌ల్లో 168.16 స్ట్రయిక్‌రేట్‌తో 53.57 సగటున సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 375 పరుగులు. -
హెడ్, స్మిత్ మెరుపులు.. సూపర్ కింగ్స్ చిత్తు
మేజర్ లీగ్ క్రికెట్-2024 టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. డల్లాస్ వేదికగా టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో వాషింగ్టన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వాషింగ్టన్ బ్యాటర్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.హెడ్ కేవలం 22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేయగా.. స్మిత్ 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 రన్స్ చేశాడు. వీరిద్దరితో పాటు మాక్స్వెల్(34), పియెనార్(33) పరుగులతో రాణించారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు, బ్రావో రెండు వికెట్లు పడగొట్టాడు. తిప్పేసిన స్పిన్నర్లు..అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 164 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో సత్తాచాటగా.. జస్దీప్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్ తలా మూడు వికెట్లు పడగొట్టి సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించారు. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్ 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ క్రికెటర్, అక్కడ మాత్రం దయనీయ స్థితిలో..!
ఈ ఏడాది (2023) ఐపీఎల్లో, అంతకుముందు జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మెరుపులు మెరిపించిన సౌతాఫ్రికన్ లెజెండ్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) ఇనాగురల్ ఎడిషన్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఎంఎల్సీ-2023లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్.. తన క్రికెటింగ్ కెరీర్లోకెళ్లా అత్యంత దారుణమైన గణాంకాలు నమోదు చేశాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 6.57 సగటున 85.18 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. లీగ్ క్రికెట్లో ఘన చరిత్ర కలిగిన డప్లెసిస్.. తన 13 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు ఏ లీగ్‌లోనూ ఇంత పేలవ ప్రదర్శన కనబర్చలేదు. డుప్లెసిస్ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ ఆందోళన చెందుతుంది. ఆ జట్టు అభిమానుల బాధ వర్ణణాతీతంగా ఉంది. డుప్లెసిస్ వచ్చే సీజన్లో ఎలాగైనా తమకు ఐపీఎల్ టైటిల్ సాధించిపెడతాడని గంపెడాశలు పెట్టుకున్న ఆర్సీబీ అభిమానులు.. ఫాఫ్ దయనీయ పరిస్థితి చూసి కుమిలిపోతున్నారు. ఇలాగైతే 2024లో కూడా తాము టైటిల్ గెలిచినట్లే అని తలలుపట్టుకుంటున్నారు. ఎంఎల్‌సీలో చెన్నై సూపర్ కింగ్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన డుప్లెసిస్.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 9 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి లీగ్ నుంచి నిష్క్రమించింది. భారతకాలమానం రేపు (జులై 31) జరుగబోయే ఫైనల్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్.. సియాటిల్ ఆర్కాస్ను ఢీకొంటుంది. కాగా, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కొనసాగుతున్న డుప్లెసిస్.. ఎంఎల్సీ మినహాయించి ఈ ఏడాది టీ20 లీగ్‌ల్లో మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో 14 మ్యాచ్‌లు ఆడిన అతను.. 56.15 సగటున, 153.68 స్ట్రయిక్ రేట్‌తో 730 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో 11 మ్యాచ్‌ల్లో 41 సగటున, 147.60 స్ట్రయిక్‌రేట్‌తో 369 పరుగులు చేశాడు. -
'ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది.. మీ ఆజ్ఞ మహారాజా!'
మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్‌లో భాగంగా ముంబై న్యూయార్క్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నికోలస్ పూరన్ సారధ్యంలోని ముంబై న్యూయార్క్ టెక్సస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన చాలెంజర్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. జూలై 31న జరగనున్న ఫైనల్లో సీటెల్ ఓర్కాస్, ముంబై న్యూయార్క్‌లు తలపడనున్నాయి. కాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్లు కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావోలు మంచి స్నేహితులన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబై న్యూయార్క్‌కు పొలార్డ్ కెప్టెన్‌గా ఉంటే.. టెక్సస్ సూపర్ కింగ్స్‌లో బ్రావో సభ్యుడిగా ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరి మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముంబై న్యూయార్క్.. టెక్సస్ సూపర్ కింగ్స్‌ను ఓడించగానే బ్రావోనూ చూస్తూ పొలార్డ్.. ''ఇక నువ్వు ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది'' అంటూ సైగలు చేశాడు. దీనికి స్పందించిన బ్రావో పొలార్డ్ ముందు తలవంచి.. ''మీ ఆజ్ఞ మహారాజా.. తప్పక పాటిస్తా'' అంటూ చేతులెత్తి నమస్కరించాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరపూశాయి. ఆ తర్వాత బ్రావో, పొలార్డ్‌లు ఒకరినొకరు హగ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. These two & their banter 😂💙 Polly wins this round, DJ! 😉#OneFamily #MINewYork #MajorLeagueCricket #MINYvTSK pic.twitter.com/wEDEe7VKvg — MI New York (@MINYCricket) July 29, 2023 చదవండి: Japan Open 2023: భారత్ కథ ముగిసింది.. సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి -
జూనియర్ 'ఏబీడీ' సూపర్ ఇన్నింగ్స్.. ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్ టీమ్
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) తొలి ఎడిషన్‌లో ముంబై న్యూయార్క్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) టెక్సస్ సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఛాలెంజర్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. న్యూయర్క్ జట్టు లక్ష్య ఛేదనలో ఆ జట్టు యువ ఆటగాడు, జూనియర్ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్ సాయంతో 41 పరుగుల చేసి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అతడితో పాటు షాయన్ జహంగీర్(36), టిమ్ డేవిడ్(33) పరుగులతో రాణించారు. టెక్సస్ సూపర్ కింగ్స్ బౌలర్లలో సామ్స్, మెహ్సిన్, థెరాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో కాన్వే(38), మిలాంద్ కుమార్(37) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. టిమ్ డేవిడ్ రెండు, ఇషాన్ అదిల్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. ఇక ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో సీటెల్ ఓర్కాస్,ముంబై న్యూయార్క్ జట్లు అమీ తుమీ తెల్చుకోనున్నాయి. చదవండి: Zim Afro T10: రాబిన్ ఉతప్ప విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో వైరల్ -
డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫైనల్లో సీటెల్ ఓర్కాస్
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) తొలి ఎడిషన్‌లో భాగంగా సీటెల్ ఓర్కాస్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) టెక్సస్ సూపర్‌కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో సీటెల్ ఓర్కాస్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సీటెల్ ఆర్కాస్ ఓపెనర్ క్వింటన్ డికాక్(50 బంతుల్లో 88 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంతో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 127 పరుగుల లక్ష్యాన్ని సులువుగా చేధించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సస్ సూపర్ కింగ్స్ సీటెల్ ఆర్కాస్ బౌలర్ల దాటికి పెద్దగా పరుగులు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. సూపర్‌కింగ్స్ బ్యాటింగ్‌లో డేనియల్ సామ్స్ 26 నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. కోడి చెట్టి, డెవాన్ కాన్వేలు తలా 24 పరుగులు చేశారు. సీటెల్ బౌలర్లలో ఆండ్రూ టై మూడు వికెట్లు తీయగా.. ఇమాద్ వసీమ్ రెండు, గానన్, హర్మీత్ సింగ్ చెరొక వికెట్ తీశారు. అనంతరం 127 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీటెల్ ఓర్కాస్ 15 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. నుమాన్ అన్వర్ రెండు పరుగులకే వెనుదిరిగినప్పటికి స్నేహన్ జయసూరియా(34 బంతుల్లో 31 నాటౌట్)తో కలిసి డికాక్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఎలిమినేటర్‌లో వాషింగ్టన్‌ను చిత్తు చేసిన ముంబై న్యూయార్క్ కాగా ముంబై న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై న్యూయార్క్ 16 పరుగులతో విజయం సాధించి చాలెంజర్‌లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసిది. అనంతరం బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. శనివారం తెల్లవారుజామున చాలెంజర్ మ్యాచ్‌లో ముంబై న్యూయార్క్.. టెక్సస్ సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. చాలెంజర్‌లో నెగ్గిన జట్టు ఆదివారం జరగబోయే ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ జట్టుతో టైటిల్ పోరులో తలపడనుంది. A TRUE QDK masterclass! @MLCSeattleOrcas clinch their spot in the inaugural #MajorLeagueCricket Championship Final! 💚 🐳 🏏 pic.twitter.com/3v71g4bn52 — Major League Cricket (@MLCricket) July 28, 2023 QDK GOES BIG WITH TWO SIXES! Quinton De Kock sends TWO SIXES over the LEG 🦵side boundaries to RAISE🖐️ his FIFTY and MORE! 7⃣9⃣/1⃣ (10.3) pic.twitter.com/hEjU1GIweU — Major League Cricket (@MLCricket) July 28, 2023 చదవండి: బ్యాటింగ్‌కు రాకపోయినా అరుదైన రికార్డుతో మెరిసిన కోహ్లి AB De Villiers: 'రొనాల్డో, ఫెదరర్‌లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు' -
చెలరేగిన డేనియల్ సామ్స్.. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన సూపర్ కింగ్స్
మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. నిన్న (జులై 24) శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన సూపర్ కింగ్స్.. పాయింట్ల పట్టికలో (6 పాయింట్లు) రెండో స్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించిన సీయాటిల్ ఆర్కాస్ టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన వాషింగ్టన్ ఫ్రీడం ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. నాలుగో బెర్త్ కోసం ముంబై ఇండియన్స్ న్యూయార్క్ (4), శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (4) పోటీపడుతుండగా.. లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ (2) లీగ్ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యునికార్న్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), చైతన్య బిష్ణోయ్ (35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. స్టోయినిస్ (13), షాదాబ్ ఖాన్ (20), కోరె ఆండర్సన్ (14), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 4 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్, మిచెల్ సాంట్నర్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన డేనియల్ సామ్స్.. తొలుత బంతితో రాణించిన సామ్స్ (2/47) ఆతర్వాత బ్యాట్‌తోనూ మెరిశాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 42 పరుగులు చేసిన సామ్స్ సూపర్‌కింగ్స్ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. 172 పరుగుల లక్ష్య ఛేదనలో సామ్స్‌తో పాటు సూపర్‌కింగ్స్ ఆటగాళ్లు డెవాన్ కాన్వే (30), మిలింద్ కుమార్ (52) కూడా రాణించారు. సామ్స్ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా సూపర్ కింగ్స్ మరో 5 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. యునికార్న్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ చెరో 2 వికెట్లు.. రోక్స్, ప్లంకెట్, స్టోయినిస్ తలో వికెట్ పడగొట్టారు. -
నిప్పులు చెరిగిన పార్నెల్.. కుప్పకూలిన సూపర్ కింగ్స్
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ ఆరంభ ఎడిషన్‌లో సీయాటిల్ ఆర్కాస్ ఫ్రాంచైజీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ జట్టు సీజన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో ఇవాళ (జులై 22) జరిగిన మ్యాచ్‌లో ఆర్కాస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు కెప్టెన్ వేన్ పార్నెల్ నిప్పులు చెరగడంతో (5/20) తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 127 పరుగులకే కుప్పకూలింది. పార్నెల్.. సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించగా, ఆండ్రూ టై (2/15), ఇమాద్ వసీం (1/25), గానన్ (1/30) మిగతా పనిని పూర్తి చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ బ్రేవో (39) టాప్ స్కోరర్‌గా నిలువగా..డేనియల్ సామ్స్ (26), కోడీ చెట్టి (22), డుప్లెసిస్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటై డెవాన్ కాన్వే (0) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (8), మిచెల్ సాంట్నర్ (2) దారుణంగా విఫలమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్కాస్.. 16 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆర్కాస్ కోల్పోయిన రెండు వికెట్లలో ఒకటి సాంట్నర్, మరొకటి మొహమ్మద్ మొహిసిన్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో ఆర్కాస్ టేబుల్ టాపర్‌గా (3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) నిలువగా.. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వాషింగ్టన్ ఫ్రీడం (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), ముంబై ఇండియన్స్ న్యూయార్క్ (3 మ్యాచ్‌ల్లో ఓ విజయం), లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. -
దంచికొట్టిన సీఎస్కే ఓపెనర్.. సూపర్‌కింగ్స్‌కు రెండో విజయం
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023)లో టెక్సస్ సూపర్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం తెల్లవారుజామున(భారత కాలమాన ప్రకారం) ముంబై న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో టెక్సస్ సూపర్ కింగ్స్ 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2023 సీజన్లో సీఎస్కే తరపున అదరగొట్టిన డెవాన్ కాన్వే మేజర్ లీగ్ క్రికెట్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేస్తున్నాడు. తాజాగా ముంబై న్యూయార్క్‌తో మ్యాచ్‌లో కాన్వే 55 బంతుల్లో 74 పరుగులతో రాణించాడు. మిచెల్ సాంట్నర్(27 పరుగులు) మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో టెక్సస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ముంబై న్యూయార్క్ బౌలర్లలో బౌల్ట్, రబాడలు చెరో రెండు వికెట్లు తీయగా.. కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్లు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ షయాన్ జాహంగీర్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టిమ్ డేవిడ్ 24 పరుగులు చేశాడు. టెక్సస్ సూపర్‌కింగ్స్ బౌలర్లలో మహ్మద్ మోషిన్, డేనియల్ సామ్స్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. రస్టీ థెరాన్, జియా ఉల్ హక్, డ్వేన్ బ్రావోలు తలా ఒక వికెట్ తీశారు. DEVON CON-do no wrong 🤩 🎉 Bow down to today's Player of the Match!!! 💛 #MajorLeagueCricket | @texassuperkings pic.twitter.com/OPbaXJBwPZ — Major League Cricket (@MLCricket) July 18, 2023 చదవండి: CWG 2026: 'అంత బడ్జెట్ మావల్ల కాదు'.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం Carlos Alcaraz: అల్కరాజ్ అందమైన గర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా? -
డ్వేన్ బ్రావో ఊచకోత.. అయినా గెలవలేకపోయిన సూపర్ కింగ్స్
మేజర్ లీగ్ క్రికెట్ 2023లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తొలి ఓటమిని ఎదుర్కొంది. వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో ఇవాళ (జులై 17) జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. వెటరన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మెరుపు ఇన్నింగ్స్‌తో (39 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడినప్పటికీ సూపర్ కింగ్స్ గెలవలేకపోయింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, తమ జట్టుకు సీజన్ తొలి గెలుపును అందించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్.. మాథ్యూ షార్ట్ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. షార్ట్‌తో పాటు ముక్తర్ అహ్మద్ (20), మోసస్ హెన్రిక్స్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 2 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ సాంట్నర్, మోహిసిన్ ఖాన్, డ్వేన్ బ్రావో తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సూపర్ కింగ్స్.. ఛేదనలో తడబడింది. మార్కో జన్సెన్ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే తొలి బంతికే క్లీన్ బౌల్డ్ కాగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (14) మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత బరిలోకి దిగిన లహీరు మిలంత (15), డేవిడ్ మిల్లర్ (14), మిలింద్ కుమార్ (3), మిచెల్ సాంట్నర్ (22) కూడా విఫలమైనా ఏడో నంబర్లో వచ్చిన బ్రావో సూపర్ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చేందుకు శక్తిమేరకు ప్రయత్నించాడు. అతనికి మరో ఎండ్‌లో సహకారం లేకపోవడంతో సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేసి, ఓటమిపాలైంది. -
తగ్గేదేలేదంటున్న సూపర్ కింగ్స్.. ధోని లేకపోయినా..!
లీగ్ క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్, దాని అనుబంధ ఫ్రాంచైజీల హవా కొనసాగుతుంది. లీగ్ ఏదైనా పసుపు దళం తగ్గేదేలేదంటుంది. ఐపీఎల్లో 5సార్లు ఛాంపియన్‌గా నిలిచి లీగ్ క్రికెట్లో మకుటం లేని మహారాజులా చలామణి అవుతున్న సీఎస్కే.. ఈ ఏడాదే మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ పేరిట ఎంట్రీ ఇచ్చి సెమీఫైనల్ వరకు చేరుకుంది. తాజాగా ఎల్లో ఆర్మీ.. టెక్సాస్ సూపర్ కింగ్స్ పేరిట మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లోకి అడుపెట్టింది. వచ్చీ రాగానే సూపర్ కింగ్స్ ఇక్కడ కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నిన్న (జులై 13) జరిగిన మ్యాచ్‌లో టీఎస్కే.. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌పై 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మినీ సీఎస్కేలా కనిపించిన టీఎస్కే.. సీఎస్కే తరహాలోనే ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో అదరగొట్టి ఎంఎల్‌సీలో తమ ప్రస్తానాన్ని విజయంతో మొదలుపెట్టింది. ఈ క్రమంలో సూపర్ కింగ్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. లీగ్ క్రికెట్లో ఎన్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలోని సూపర్ కింగ్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్.. ప్రపంచంలోని మేజర్ క్రికెట్ లీగ్‌లన్నింటిలో తమ ప్రస్తానాన్ని విజయంతో ప్రారంభించాయి. 2008 ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో నాటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై విజయంతో లీగ్ క్రికెట్లో తమ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన సూపర్ కింగ్స్.. ఇదే ఏడాది ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ తమ ప్రస్తానాన్ని విజయంతోనే (డర్బన్ సూపర్ జెయింట్స్‌పై విజయం) ప్రారంభించింది. తాజాగా ఎంఎల్సీని కూడా విజయంతో ప్రారంభించిన సూపర్ కింగ్స్.. ప్రపంచవ్యాప్తంగా తాము పాల్గొంటున్న ప్రతి లీగ్‌లో విజయంతోనే ఖాతా తెరిచింది. Super Kings 🤝 Tournament openers The trend continues for the men in Yellow!#CricTracker #T20Cricket pic.twitter.com/hvJB3bb7GW — CricTracker (@Cricketracker) July 14, 2023 ధోని లేకపోయినా.. సీఎస్కే అనుబంధ ఫ్రాంచైజీ అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్ అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్‌ను విజయంతో ప్రారంభించింది. భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకూడదన్న నిబంధన ఉన్న నేపథ్యంలో ఎంఎల్‌సీలో సూపర్ కింగ్స్‌కు ధోని కాకుండా ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వం వహిస్తున్నాడు. ఎంఎల్‌సీలో సూపర్ కింగ్స్‌తో ధోని లేకపోయినా, ఆ జట్టు విజయంతోనే ఖాతా తెరిచింది. సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే (55) ఎంఎల్‌సీలోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తా చాటాడు. సీఎస్కే సభ్యులు మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21; 2 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి, తమ జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. -
మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. రసెల్ పోరాటం వృధా.. బోణీ కొట్టిన సూపర్ కింగ్స్
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) తొలి సీజన్ నిన్నటి (జులై 13) నుంచి ప్రారంభమైంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్.. లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌పై విజయఢంకా మోగించింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ప్రారంభమైన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 69 పరుగుల తేడాతో గెలుపొంది, ఎంఎల్సీ-2023లో బోణీ విజయం దక్కించుకుంది. మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. కాన్వే సూపర్ ఫిఫ్టి.. బ్రేవో మెరుపులు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. కాన్వే (37 బంతుల్లో 55; 7 ఫోర్లు, సిక్స్), డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 61; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21; 2 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. నైట్‌రైడర్స్ బౌలరల్లో అలీ ఖాన్, లోకీ ఫెర్గూసన్ తలో 2 వికెట్లు.. సునీల్ నరైన్, ఆడమ్ జంపా చెరో వికెట్ దక్కించుకున్నారు. రసెల్ పోరాటం వృధా.. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. సూపర్ కింగ్స్ బౌలర్ల ధాటికి 14 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. సూపర్ కింగ్స్ స్పిన్నర్ మొహమ్మద్ మొహిసిన్ (4/8) నైట్‌రైడర్స్ పతనాన్ని శాశించగా.. గెరాల్డ్ కొయెట్జీ, రస్టీ థెరన్ తలో 2 వికెట్లు, కాల్విన్ సావేజ్, డ్వేన్ బ్రేవో చెరో వికెట్ పడగొట్టారు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కడుతుంటే విండీస్ విధ్వంసర వీరుడు ఆండ్రీ రసెల్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. జస్కరన్ మల్హోత్రా (22), సునీల్ నరైన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మార్టిన్ గప్తిల్ (0), ఉన్ముక్త్ చంద్ (4), రిలీ రొస్సో (4), జంపా (3), ఫెర్గూసన్ (1) నిరాశపరిచారు. కాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే ఎంఎల్సీ జట్లను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను, కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం.. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌ను సొంతం చేసుకున్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (భారతకాలమానం ప్రకారం) సీటిల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లు.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్లు తలపడతాయి.