మేజర్ లీగ్ క్రికెట్-2024 టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. డల్లాస్ వేదికగా టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో వాషింగ్టన్ ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వాషింగ్టన్ బ్యాటర్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
హెడ్ కేవలం 22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేయగా.. స్మిత్ 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 రన్స్ చేశాడు. వీరిద్దరితో పాటు మాక్స్‌వెల్(34), పియెనార్(33) పరుగులతో రాణించారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు, బ్రావో రెండు వికెట్లు పడగొట్టాడు.
తిప్పేసిన స్పిన్నర్లు..
అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 164 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో సత్తాచాటగా.. జస్‌దీప్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్ తలా మూడు వికెట్లు పడగొట్టి సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించారు. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్ 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment