మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ తొలి విజయం నమోదు చేసింది. నిన్న (జులై 23) సీయాటిల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. రిలీ రొస్సో (38 బంతుల్లో 78 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయమైన మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడి నైట్ రైడర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రొస్సోకు ఆండ్రీ రసెల్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకరించాడు. ఫలితంగా నైట్ రైడర్స్.. ఆర్కాస్ నిర్ధేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది.
One of the innings of the tournament 👏
— Major League Cricket (@MLCricket) July 23, 2023
Rilee Rossouw wins the Player of the Match award for his impressive 7️⃣8️⃣* (3️⃣8️⃣)#MLC2023 pic.twitter.com/WQhNFWn3UH
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్.. షెహన్ జయసూర్య (45 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ డికాక్ (10) విఫలం కాగా.. నౌమన్ అన్వర్ (32; 5 ఫోర్లు), క్లాసెన్ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. నైట్ రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 2 వికెట్లు పడగొట్టగా.. స్పెన్సర్ జాన్సన్, ఆండ్రీ రసెల్, వాన్ షాల్విక్, కెప్టెన్ సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్‌కు మంచి ఆరంభం లభించనప్పటికీ.. రొస్సో, రసెల్ ఆ జట్టును గెలిపించారు. 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన రొస్సో ఆఖరి వరకు క్రీజ్‌లో నిలబడి నైట్ రైడర్స్‌కు సీజన్ తొలి విజయాన్ని అందించాడు. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (2), జస్కరన్ మల్హోత్రా (2), గజానంద్ సింగ్ (3),సునీల్ నరైన్ (8) విఫలం కాగా.. సైఫ్ దర్బార్ (10), వాన్ షాల్విక్ (12), ఆడమ్ జంపా (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఆర్కాస్ బౌలర్లలో కెమరాన్ గానన్ 3 వికెట్లతో రాణించగా.. ఆండ్రూ టై 2, ఇమాద్ వసీం, కెప్టెన్ వేన్ పార్నెల్, హర్మీత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment