
courtesy : IPL Twitter
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా సోమవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ మొయిసిస్ హెన్రిక్స్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో 12వ ఓవర్ వేసిన సునీల్ నరైన్.. నాలుగో బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరాడు. హెన్రిక్స దానిని స్వ్కేర్ కట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
ఈ నేపథ్యంలో బ్యాట్‌ని బలంగా ఊపడంతో అతని చేతి నుంచి జారిపోయింది.ఈలోగా బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి వెనక్కి వెళ్లింది. కానీ దినేశ్ కార్తీక్ లేటుగా స్పందించడంతో అతని కాళ్ల మధ్యలో నుంచి బంతి వెనక్కి వెళ్లిపోయింది. క్యాచ్ చేజారడంతో సునీల్ నరైన్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే హెన్రిక్స్ చేతి నుంచి చేజారిన బ్యాట్ ఏ ఫీల్డర్‌కి తాకకపోవడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.
ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని 16.4 ఓవర్లలోనే చేధించింది. మోర్గాన్ 47 పరుగులు నాటౌట్ చివరివరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఇక కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్‌లో ఏప్రిల్ 29న అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
చదవండి: రవి బిష్ణోయ్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
హర్షల్ వస్తుంటే.. ధోని జోకులు.. రైనా నవ్వులు
— Aditya Das (@lodulalit001) April 26, 2021