ఐపీఎల్‌ 2021: పంజాబ్‌పై కేకేఆర్‌ విజయం | IPL 2021: Punjab Kings Vs KKR Match Live Updates | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2021: పంజాబ్‌పై కేకేఆర్‌ విజయం

Published Mon, Apr 26 2021 7:03 PM | Last Updated on Tue, Apr 27 2021 7:22 AM

IPL 2021: Punjab Kings Vs KKR Match Live Updates - Sakshi

courtesy : IPL Twitter

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కేకేఆర్‌ వరుసగా నాలుగు పరాజయాల తర్వాత మరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కేకేఆర్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ 47 పరుగులు నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. త్రిపాఠి 41, కార్తీక్‌ 12 పరుగులు నాటౌట్‌ అతనికి సహకరించారు. పంజాబ్‌ బౌలర్లలో హెన్రిక్స్‌, షమీ, అర్షదీప్‌, హుడా తలా ఒక వికెట్‌ తీశారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కేకేఆర్‌ బౌలర్ల దాటికి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఒక దశలో వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే చివర్లో క్రిస్‌ జోర్డాన్‌(18 బంతుల్లో 30 పరుగులు; 3 సిక్సర్లు, 1 ఫోర్‌) వేగంగా ఆడడంతో  కనీసం ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓపెనర్‌ మయాంక్‌ 31 పరుగులు చేశాడు. కేకేఆర్‌ బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ 3, కమిన్స్‌, నరైన్‌ చెరో 2, మావి, వరుణ్‌ చక్రవర్తి తలా ఒక వికెట్‌ తీశారు. 

రసెల్‌ రనౌట్‌.. కేకేఆర్‌ 115/5
కేకేఆర్‌ మరో వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన ఆండ్రీ రసెల్‌ అర్షదీప్‌ వేసిన డైరెక్ట్‌ త్రోకు రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం కేకేఆర్‌ స్కోరు 16 ఓవర్లలో 115/5గా ఉంది. మోర్గాన్‌ 45, దినేష్‌ కార్తిక్‌ 2 పరుగులతో క్రీజలో ఉన్నారు. 

రాహుల్‌ త్రిపాఠి( 42) రూపంలో కేకేఆర్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. దీపక్‌ హుడా వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ చివరి బంతిని షాట్‌ ఆడే ప్రయత్నంలో షారుఖ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. మోర్గాన్‌ 27, రసెల్‌ 4 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

10 ఓవర్లలో కేకేఆర్‌ 76/3
పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ లక్ష్యం దిశగా సాగుతుంది. 10 ఓవర్ల ఆట ముగిసేసరికి కేకేఆర్‌ మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి 36,  మోర్గాన్‌ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్‌.. స్కోరు 46/3
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. అర్షదీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ చివరి బంతికి సునీల్‌ నరైన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా నరైన్‌ భారీ షాట్‌కు యత్నించాడు. అయితే రవి బిష్ణోయ్‌ చాలా దూరం ముందుకు పరిగెత్తుకు వచ్చి డైవ్‌ చేస్తూ అద్భుత క్యాచ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.

10 పరుగులకే రెండు వికెట్లు డౌన్‌
124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 10 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. హెన్రిక్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే నితీష్‌ రానా డకౌట్‌గా వెనుదిరగ్గా... షమీ వేసిన రెండో ఓవర్‌లో 9 పరుగులు చేసిన గిల్‌ ఎల్బీగా అవుటయ్యాడు.  ప్రస్తుతం కేకేఆర్‌ స్కోరు 2 ఓవర్లలో 10/2 గా ఉంది.

కేకేఆర్‌ టార్గెట్‌ 124
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కేకేఆర్‌ బౌలర్ల దాటికి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఒక దశలో వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే చివర్లో క్రిస్‌ జోర్డాన్‌(18 బంతుల్లో 30 పరుగులు; 3 సిక్సర్లు, 1 ఫోర్‌) వేగంగా ఆడడంతో  కనీసం ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓపెనర్‌ మయాంక్‌ 31 పరుగులు చేశాడు. కేకేఆర్‌ బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ 3, కమిన్స్‌, నరైన్‌ చెరో 2, మావి, వరుణ్‌ చక్రవర్తి తలా ఒక వికెట్‌ తీశారు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
పంజాబ్‌ కింగ్స్‌ 7వ వికెట్‌ను కోల్పోయింది. 13 పరుగులు చేసిన షారుఖ్‌ ఖాన్‌ ప్రసిధ్‌ బౌలింగ్‌లో మోర్గాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్‌ స్కోరు 17 ఓవర్లలో  95/7గా ఉంది. 

సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్‌.. 78/5
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కేకేఆర్‌ బౌలర్లు కట్టుదిట్టంగా  బౌలింగ్‌ చేస్తుండడంతో పరుగులు చేయలేక వరుస విరామాల్లో వికెట్లను చేజార్చుకుంటుంది.

10 ఓవర్లలో పంజాబ్‌ స్కోరు 56/3
పంజాబ్‌ కింగ్స్‌ 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ పంజాబ్‌ ఇన్నింగ్స్‌కు మయాంక్‌, పూరన్‌లు నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. మయాంక్‌ 29, పూరన్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
పంజాబ్‌ కింగ్స్‌ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతుంది. 1 పరుగు చేసిన దీపక్‌ హుడా ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో మోర్గాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పంజాబ్‌ స్కోరు 8 ఓవర్లలో 44/3 గా ఉంది. మయాంక్‌ 20, పూరన​ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

గేల్‌ గోల్డెన్‌ డక్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
పంజాబ్‌ కింగ్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. పవర్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. శివమ్‌ మావి వేసిన ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ మూడో బంతిని ఆడే ప్రయత్నంలో గేల్‌ బ్యాట్‌ను తాకుతూ కీపర్‌ చేతుల్లో పడింది. అయితే అంపైర్‌ అవుట్‌ ఇవ్వకపోవడంతో కేకేఆర్‌ రివ్యుకు వెళ్లింది. రిప్లేలో బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లడంతో గేల్‌ ఔటయ్యాడు. ప్రస్తుతం పంజాబ్‌ 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. 

కేఎల్‌ రాహుల్ ఔట్‌.. పంజాబ్‌ 37/1
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 19 పరుగులు చేసిన రాహుల్‌ పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి నరైన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్‌ ప్లే ముగిసేసరికి 6 ఓవర్లలో పంజాబ్‌ స్కోరు 37/1గా ఉంది. మయాంక్‌ 16, గేల్‌(0) క్రీజులో ఉన్నారు.

3 ఓవర్లలో పంజాబ్‌ స్కోరు 20/0
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించింది. 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ స్కోరు 20/0గా ఉంది. రాహుల్‌ 6, మయాంక్‌ అగర్వాల్‌ 12 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

అహ్మదాబాద్‌: ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుస పరాజయాలతో ఢీలాపడిపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నేడు పంజాబ్‌ కింగ్స్‌తో తలపడతుంది. కాగా టాస్‌ గెలిచిన కేకేఆర్‌.. ఫీల్డింగ్‌ ఎంచుకుంది.  ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లాడిన కేకేఆర్‌ ఒక్కదాంట్లో గెలిచి.. మిగతా నాలుగింటిలో ఓడిపోయింది. ఇక పంజాబ్ కింగ్స్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట ఓడి..  రెండింటిలో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌కు కేకేఆర్‌ ఏ మార్పు చేయలేదు.. పంజాబ్‌ కింగ్స్‌ మాత్రం ఫాబియెన్‌ అలెన్‌ స్థానంలో క్రిస్‌ జోర్డాన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. 

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌, కేకేఆర్‌ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే..  ఇప్పటి వరకూ  ఇరుజట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడగా.. 18 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ విజయం సాధించగా..  మిగిలిన 9 మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. కాగా పంజాబ్‌పై కోల్‌కతా చేసిన అత్యధిక పరుగులు 245కాగా.. కోల్‌కతాపై పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 214 పరుగులుగా ఉంది.

కేకేఆర్‌: ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), నితీశ్‌ రాణా, శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, సునీల్‌ నరైన్‌, దినేశ్‌ కార్తిక్‌, అండ్రీ రసెల్‌, పాట్‌ కమిన్స్‌, వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ మావి, ప్రసిద్ధ కృష్ణ

పంజాబ్‌ కింగ్స్‌: కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌)‌, మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, పూరన్‌‌, దీపక్‌ హూడా, షారుఖ్‌ ఖాన్‌, క్రిస్‌ జోర్డాన్‌, మెయిసిస్‌ హెన్రిక్స్, షమీ, రవి బిష్ణోయి, అర్షదీప్‌ సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement