courtesy : IPL Twitter
కేకేఆర్‌తో జరిగిన మ్యచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 16. 3 ఓవర్లలోనే చేధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌లో పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 40 బంతుల్లోనే 11 ఫోర్లు.. 3 సిక్సర్లు బాది 82 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. శిఖర్ ధావన్ 46 పరుగులతో అతనికి సహకరించాడు. మొదటి వికెట్‌కు ఈ ఇద్దరు కలిసి రికార్డు స్థాయిలో 132 పరుగులు జోడించి విజయానికి బాటలు పరిచారు. విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో పృథ్వీ ఔట్ కాగా.. 16 పరుగులు చేసి పంత్ కూడా అవుట్ అయ్యాడు. అయితే మరో వికెట్ పడకుండా హెట్‌మైర్, స్టోయినిస్ లాంచనాన్ని పూర్తి చేశారు. కేకేఆర్ బౌలర్లలో కమిన్స్‌కు రెండు వికెట్లు దక్కగా.. మిగతా బౌలర్లు దారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. చివర్లో రసెల్(27 బంతుల్లో 45, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. శుబ్‌మన్ గిల్ 43 పరుగులతో ఆకట్టుకోగా కేకేఆర్ బ్యాట్స్‌మెన్లలో ఇద్దరు డకౌట్‌గా వెనుదిరిగారు. ఢిల్లీ బౌలర్లలో లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీయగా.. ఆవేశ్‌ఖాన్, స్టొయినిస్ చెరో వికెట్ తీశారు
భారీ విజయం దిశగా ఢిల్లీ క్యాపిటల్స్
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం దిశగా సాగుతుంది. 13 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. పృథ్వీ షా 79, ధావన్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి ఇంకా 32 పరుగుల దూరంలో మాత్రమే ఉంద
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ లక్ష్యం దిశగా దూసుకుపోతుంది. 9 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 84/0 గా ఉంది.పృథ్వీ షా 55, ధావన్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక పృథ్వీ షా (18 బంతుల్లో 50) హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకొని ఢిల్లీ తరపున తక్కువ బంతుల్లో ఫిప్టీ సాధించి పంత్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి స్థానంలో మోరిస్(17 బంతులు) ఉన్నాడు
పృథ్వీ షా జోరు.. 7 ఓవర్లలో 71/0
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతుండడంతో 7 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 71/0 గా ఉంది. ఈ సీజన్‌లో పవర ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. పృథ్వీ షా 49, ధావన్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఢిల్లీ దూకుడు.. 3 ఓవర్లలో 43/0
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడు కనబరుస్తుంది. శివమ్ మావి వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో పృథ్వీ షా వైడ్ సహా మొత్తం 25 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టిన పృథ్వీ షా తాను ఎంత ప్రమాదకర ఆటగాడో చెప్పకనే చెప్పాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టాపోకుండా 43 పరుగులు చేసింది. షా 32, ధావన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. వరుస విరామాల్లొ వికెట్లు కోల్పోతూ ఒక దశలో 100 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే చివర్లో రసెల్(27 బంతుల్లో 45, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. శుబ్‌మన్ గిల్ 43 పరుగులతో ఆకట్టుకోగా కేకేఆర్ బ్యాట్స్‌మెన్లలో ఇద్దరు డకౌట్‌గా వెనుదిరిగారు. ఢిల్లీ బౌలర్లలో లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీయగా.. ఆవేశ్‌ఖాన్, స్టొయినిస్ చెరో వికెట్ తీశారు.
ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. 109/6
కేకేఆర్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. 14 పరుగులు చేసిన కార్తిక్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 17 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. కమిన్స్ 3, రసెల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లలిత్ యాదవ్ దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఢిల్లీ బౌలర్ లలిత్ యాదవ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో రెండో బంతికి మోర్గాన్‌ను డకౌట్ చేసిన లలిత్ నాలుగో బంతికి నరైన్(0) క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 75 పరుగలకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. గిల్ 41, రసెల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్
రాహుల్ త్రిపాఠి(19) రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 10 ఓవర్ల ఆట ముగిసేసరికి 2 వికెట్లు నష్టపోయి 73 పరుగులు చేసింది.
9 ఓవర్ల ఆట ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. గిల్ 34, త్రిపాఠి 19 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 15 పరుగులు చేసిన రానా అక్షర్ బౌలింగ్‌లొ స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. 32/1
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన నితీష్ రానా అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పంత్ మెరుపు స్టంపింగ్‌కు వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. గిల్ 12, రాహుల్ త్రిపాఠి 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు కేకేఆర్‌తో తలపడనుంది. ఆర్‌సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైన ఢిల్లీ కేకేఆర్‌పై విజయం సాధించాలని చూస్తుంది. మరోవైపు వరుసగా నాలుగు పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు రుచి చూసిన కేకేఆర్ అదే జోరును కొనసాగించాలిన భావిస్తుంది. ఇక టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇరు జట్ల మధ్య ముఖాముఖి రికార్డుల్ని పరిశీలిస్తే.. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 26 మ్యాచ్‌ల్లో తలపడగా.. 14 మ్యాచ్‌ల్లో కేకేఆర్.. 11 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొంగా.. ఒక దాంట్లో మాత్రం ఫలితం రాలేదు. ఇక ఢిల్లీపై కోల్‌కతా చేసిన అత్యధిక స్కోరు 210 పరుగులు కాగా.. కోల్‌కతాపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 228 పరుగులుగా ఉంది. ఇక గత సీజన్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ , కేకేఆర్ చెరో మ్యాచ్‌ను గెలిచాయి.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, ధవన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, షిమ్రోన్ హెట్మేయర్, స్టొయినిస్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, రబాడ, లలిత్ యాదవ్, ఆవేశ్ ఖాన్
కేకేఆర్: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), నితీశ్ రాణా, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, దినేశ్ కార్తిక్, అండ్రీ రసెల్, పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి, ప్రసిద్ధ కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment