Photo Courtesy: IPL
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. కేకేఆర్‌పై పంజాబ్ కింగ్స్ విజయం
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో(67 పరుగులు) ఆకట్టుకున్నాడు. కాగా చివర్లో షారుక్ ఖాన్(22) పరుగులతో జట్టును గెలిపించాడు. అంతకముందు మయాంక్ అగర్వాల్ 40 పరుగులతో రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, సునీల్ నరైన్, శివమ్ మావి చెరో వికెట్ తీశారు.
కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(67 పరుగులు) హాఫ్ సెంచరీతో మెరవగా.. రాహుల్ త్రిపాఠి 34, నితీష్ రాణా 31 పరుగులతో అయ్యర్‌కు సహకరించారు. అయితే అయ్యర్, రాణాలు ఉన్నంతసేపు కేకేఆర్ భారీ స్కోరు చేస్తుందని భావించారు. కాగా ఆఖర్లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ పరుగులు చేయలేకపోయింది. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్.. 142/4
ఎయిడెన్ మక్రమ్ రూపంలో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన మక్రమ్ నరైన్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్ ఫిప్టీ.. విజయానికి 38 పరుగుల దూరంలో
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ క్లాస్ అర్థశతకంతో మెరిశాడు. 42 బంతుల్లో 2 ఫోర్లు.. 2 సిక్సర్లతో రాహుల్ అర్థశతకం మార్క్‌ను అందుకున్నాడు. పంజాబ్ విజయానికి ఇంకా 38 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 53, మక్రమ్ 18 పరుగులతో ఆడుతున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. 92/2
నికోలస్ పూరన్(12) రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. రాహుల్ 30, మక్రమ్ 0 పరుగులతో ఆడుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. 10 ఓవర్లలో 76/1
మయాంక్ అగర్వాల్(40) రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ ఐదో బంతిని మయాంక్ కవర్స్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న మోర్గాన్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 70 పరుగులు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 28, పూరన్ 5 పరుగులతో ఆడతున్నారు.
6 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 46/0
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 31, కేఎల్ రాహుల్ 14 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
పంజాబ్ కింగ్స్ టార్గెట్ 166
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(67 పరుగులు) హాఫ్ సెంచరీతో మెరవగా.. రాహుల్ త్రిపాఠి 34, నితీష్ రాణా 31 పరుగులతో అయ్యర్‌కు సహకరించారు. అయితే అయ్యర్, రాణాలు ఉన్నంతసేపు కేకేఆర్ భారీ స్కోరు చేస్తుందని భావించారు. కాగా ఆఖర్లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ పరుగులు చేయలేకపోయింది. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు.
Photo Courtesy: IPL
4 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు.. కేకేఆర్ 124/4
ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో మహ్మద్ షమీ వేసిన అద్బుతమైన యార్కర్‌కు కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(2) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో కేకేఆర్ 4 పరుగుల వ్యవధిలో 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 15. 5ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 124/4. క్రీజ్‌లో నితీశ్ రాణా(11), దినేశ్ కార్తీక్ ఉన్నారు.
Photo Courtesy: IPL
వెంకటేశ్ అయ్యర్ ఔట్(67).. కేకేఆర్ 121/3
ధాటిగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్ (49 బంతుల్లో 67; 9 ఫోర్లు, సిక్స్)ను రవి బిష్ణోయి బోల్తా కొట్టించాడు. బిష్ణోయి విసిరిన గూగ్లి బంతిని స్వీప్ షాట్ ఆడబోయి దీపక్ హూడాకు క్యాచ్ ఇచ్చి అయ్యర్ వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 121/3. క్రీజ్‌లో నితీశ్ రాణా(10), మోర్గాన్ ఉన్నారు.
Photo Courtesy: IPL
వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీ.. కేకేఆర్ 104/2
కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ అర్థశతకంతో మెరిశాడు. 39 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్న అయ్యర్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు.. ఒక సిక్సర్ ఉన్నాయి. ప్రస్తుతం కేకేఆర్ 13 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. అయ్యర్ 58, నితీష్ రాణా 3 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు దాటిగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠిని(34) రవి బిష్ణోయి ఔట్ చేసి పంజాబ్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో మూడో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో త్రిపాఠి హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Photo Courtesy: IPL
దాటిగా ఆడుతున్న అయ్యర్.. కేకేఆర్ 73/1
కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ దాటిగా ఆడుతున్నాడు. 30 బంతులెదుర్కొన్న అయ్యర్ 42 పరుగులు చేయగా.. అందులో 7 ఫోర్లు ఉన్నాయి. అతనికి రాహుల్ త్రిపాఠి 22 చక్కగా సహకరిస్తున్నాడు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. అంతకముందు గిల్ 7 పరుగుల వద్ద ఔటయ్యాడు.
6 ఓవర్లలో కేకేఆర్ 48/1
పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్ నడిపిస్తున్నాడు. అయ్యర్ 27, త్రిపాఠి 10 పరుగలతో ఆడుతున్నారు.
Photo Courtesy: IPL
శుబ్‌మన్ గిల్ ఔట్.. కేకేఆర్ 23/1
ఓపెనర్ శుబ్‌మన్ గిల్(7) రూపంలో కేకేఆర్ తొలి వికెట్‌ను కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ రెండో బంతికి గిల్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. అయ్యర్ 10, రాహుల్ త్రిపాఠి 4 పరుగులతో ఆడుతున్నారు.
Photo Courtesy: IPL
దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ రేసులో ఉన్న కేకేఆర్‌ను పంజాబ్ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి. కాగా తొలి అంచె పోటీల్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌నే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్ 16.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇక ముఖాముఖి పోరులో ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరగ్గా.. 19 మ్యాచ్‌ల్లో కేకేఆర్ నెగ్గగా.. తొమ్మిది మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్‌ను విజయం వరించింది.
పంజాబ్ కింగ్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మక్రమ్, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, నాథన్ ఎల్లిస్, మొహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్
కేకేఆర్: శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ , రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్( వికెట్ కీపర్),టిమ్ సీఫర్ట్ , సునీల్ నరైన్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి,శివమ్ మావి
Comments
Please login to add a commentAdd a comment