హెన్రిక్స్‌కు నేడు శస్త్ర చికిత్స | Moises Henriques and Rory Burns recovering well from surgery after clash | Sakshi
Sakshi News home page

హెన్రిక్స్‌కు నేడు శస్త్ర చికిత్స

Published Tue, Jun 16 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

హెన్రిక్స్‌కు నేడు శస్త్ర చికిత్స

హెన్రిక్స్‌కు నేడు శస్త్ర చికిత్స

 లండన్: కౌంటీ మ్యాచ్‌లో సహచరుడిని బలంగా ఢీకొని గాయపడిన ఆస్ట్రేలియా ఆటగాడు మోజెస్ హెన్రిక్స్‌కు నేడు (మంగళవారం) శస్త్ర చికిత్స చేయనున్నారు. ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ను పట్టుకునేందుకు సర్రే ఆటగాళ్లు హెన్రిక్స్, రోరి బర్న్స్ ప్రయత్నిస్తుండగా అనుకోకుండా ఒకరినొకరు ఢీకొన్నారు. ఈక్రమంలో హెన్రిక్స్ దవడ మూడు చోట్ల విరిగింది. అటు బర్న్స్ తల, కంటికి గాయమైంది. ఇద్దరినీ వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా ప్రమాదమేమీ లేదని డాక్టర్లు ప్రకటించారు. ‘ఇది నిజంగా దురదృష్టకరమైన వార్త. హెన్రిక్స్‌కు తొలి సర్జరీ చేయనున్నారు. పూర్తిగా కోలుకునే వరకు తను ఇంగ్లండ్‌లోనే ఉంటాడు’ అని క్రికెట్ న్యూసౌత్ వేల్స్ సీఈవో ఆండ్రూ జోన్స్ తెలిపారు. మరోవైపు హెన్రిక్స్ ప్రియురాలిని యూకే పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తను మాట్లాడే స్థితిలో లేకపోయినా సంక్షిప్త సందేశాలతో బదులిస్తున్నట్టు హెన్రిక్స్ మేనేజర్ నిక్ ఫోర్దమ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement