ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ఎస్‌సీఎఫ్ ఘన సన్మానం | Football players SCF solid honor | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ఎస్‌సీఎఫ్ ఘన సన్మానం

Published Sun, Oct 5 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ఎస్‌సీఎఫ్ ఘన సన్మానం

ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ఎస్‌సీఎఫ్ ఘన సన్మానం

సాక్షి, హైదరాబాద్: ‘హోమ్‌లెస్ ఫుట్‌బాల్ ప్రపంచ కప్’ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైన సిమర్ ప్రీత్, తారిఖ్ అహ్మద్‌లను స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్) ఘనంగా సత్కరించింది. గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ ఇద్దరికి చెరో రూ. 5 వేల నగదు పురస్కారాన్ని అందజేసింది. తెలంగాణ, ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ మహ్మద్ రఫత్ అలీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆటగాళ్లను సన్మానించారు. ఫుట్‌బాల్ క్రీడను అద్భుతంగా ప్రమోట్ చేస్తున్న ఎస్‌సీఎఫ్ కార్యదర్శి కె.సాయిబాబాను అలీ ప్రశంసించారు. ఎస్‌సీఎఫ్ ఫుట్‌బాల్ ట్రెయినింగ్ సెంటర్‌లో శిక్షణ పొందిన ఏడుగురు ఇప్పటికే రాష్ట్రం తరఫున ఆడుతున్నారని సాయిబాబా తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఇతర వేదికల్లో జరిగిన టోర్నీలో రాష్ట్ర జట్టు చాలా మ్యాచ్‌లు గెలిచిందన్నారు. వచ్చే నెల రెండో వారంలో దక్షిణ అమెరికాలోని చిలీలో ఈ హోమ్‌లెస్ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement