solid honor
-
ఎంపీ కనకమేడలకు ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్: ఏపీ టీడీపీ తరఫున ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ను బుధవారం హైకోర్టు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావు, ఇరు సంఘాల అధ్యక్షులు జల్లి కనకయ్య, చల్లా ధనంజయ తదితరులు పాల్గొన్నారు. -
ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ఎస్సీఎఫ్ ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్: ‘హోమ్‌లెస్ ఫుట్‌బాల్ ప్రపంచ కప్’ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైన సిమర్ ప్రీత్, తారిఖ్ అహ్మద్‌లను స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్) ఘనంగా సత్కరించింది. గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ ఇద్దరికి చెరో రూ. 5 వేల నగదు పురస్కారాన్ని అందజేసింది. తెలంగాణ, ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ మహ్మద్ రఫత్ అలీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆటగాళ్లను సన్మానించారు. ఫుట్‌బాల్ క్రీడను అద్భుతంగా ప్రమోట్ చేస్తున్న ఎస్సీఎఫ్ కార్యదర్శి కె.సాయిబాబాను అలీ ప్రశంసించారు. ఎస్సీఎఫ్ ఫుట్‌బాల్ ట్రెయినింగ్ సెంటర్లో శిక్షణ పొందిన ఏడుగురు ఇప్పటికే రాష్ట్రం తరఫున ఆడుతున్నారని సాయిబాబా తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఇతర వేదికల్లో జరిగిన టోర్నీలో రాష్ట్ర జట్టు చాలా మ్యాచ్‌లు గెలిచిందన్నారు. వచ్చే నెల రెండో వారంలో దక్షిణ అమెరికాలోని చిలీలో ఈ హోమ్‌లెస్ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.