జాతీయ రెజ్లింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
గంటూరు స్పోర్ట్స్ : విశాఖపట్నంలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్ రెజ్లింగ్ పోటీలలో జిల్లా రెజ్లింగ్ జట్టు ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించిందని రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.భూషణం, కోశాధికారి పి.ఆనంద కుమార్ సోమవారం తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలలో కారంపూడి గురుకుల పాఠశాలకు చెందిన బి.నరేంద్ర, నర్సరావుపేట ఎస్‌ఎస్‌ఎన్ కళాశాలకు చెందిన ఎన్.పెదరాయుడు, సత్తెనపల్లి›ఎస్‌వి డిగ్రీ కళాశాలకు చెందిన కె.అనిల్ అత్యంత ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించి, జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. వీరితో పాటు వై.రత్నకుమార్, ఎన్.శివ, సి.హెచ్ రాజు, కె.ప్రసాద్ బాబు కాంస్య పతకాలు సాధించారన్నారు. మహిళల విభాగంలో బి.సం««ధ్య రజత, కె.వెంకట రమణ, పి.శిరీష కాంస్య పతకాలు సాధించారని పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు జనవరిలో బీహర్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగే జాతీయ పోటీలలో పాల్గొంటారన్నారు.