పరకాల, న్యూస్‌లైన్ : పోటీల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరాశకు గురికాకుండా గెలుపునకు బాటలు వేసుకోవాలని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. పట్టణంలోని ఎఫ్‌జే ఫంక్షన్‌హాల్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి జూడో చాంపియన్‌షిప్ పోటీలను బుధవారం సాయంత్రం ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. పోరాటాల పురిటిగడ్డ పరకాలలో రాష్ట్రస్థాయి జూడో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రపంచ దేశాల సరసన మనదేశం నిలబడేలా ఈ ప్రాంతంలోని క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించాలని కో రారు. పరకాలలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం రెండోరోజు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. సమావేశంలో జూడో రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాష్, ప్రధాన కార్యదర్శి బైరుపాక కైలాస్‌యాదవ్, ప్రోగ్రాం ఆర్గనైజర్ బండి సారంగపాణి, కాంగ్రెస్ నాయకులు సాంబారి సమ్మారావు, వీర్ల విజయ్, అజయ్‌కుమార్, దేవాదానం, కేఎల్. బాబు, నాగరాజు, వీరస్వామి పాల్గొన్నారు.
రెండో రోజు విజేతలు వీరే.....
20కేజీల(ప్లస్) విభాగంలో బాలికలు : నికిత(వరంగల్) ప్రథమ, బి. వైష్ణవి (అనంతపురం) ద్వితీయ, జే. వైదేవి (చిత్తూరు), రుచిత (మహబూబ్‌నగర్) తృతీయ.
30కేజీల(మైనస్) విభాగం : జి.నవ్య (అనంతపురం) ప్రథమ, బి.అర్చన ద్వితీయ(తూర్పుగోదావరి), ఓ. రచన(నిజామాబాద్), జి.నయా(ఖమ్మం) తృతీయ.
30కేజీల(ప్లస్) విభాగం : పి.తేజస్వీని (అనంతపురం)ప్రథమ, వి.రమ్యశ్రీ(వరంగల్) ద్వితీయ, టి. పూజిత (నిజామాబాద్), బి. స్నేహా (నల్గొండ) తృతీయ.
25కేజీల(ప్లస్) విభాగంలో బాలుర విభాగం : డి.దేవేంద్ర(అనంతపురం) ప్రథమ, బి.అజయ్(కృష్ణా) ద్వితీయ, ఎం. సందీప్(తూర్పుగోదావరి), ఎం. సాయికిరణ్(నల్గొండ)లు తృతీయ.
35కేజీల(మైనస్) విభాగం : సీహెచ్. హరీష్(వరంగల్) ప్రథమ, టి. ఉదయ్‌కుమార్(చిత్తూరు) ద్వితీయ, ఏ. సంపత్‌కుమార్(నల్గొండ), డి.కల్యాణ్( అనంతపురం)లు తృతీయ.
35కేజీల(ప్లస్) విభాగం : వంశీకృష్ణ(మెదక్) ప్రథమ, ఆర్. సాయిప్రకాష్ (రంగారెడ్డి) ద్వితీయ, విక్రమ్(మహబూబ్‌నగర్), శ్రావణ్ (వరంగల్) తృతీయ గెలుపొందారు.
ఓటమి విజయానికి నాంది కావాలి
Published Thu, Aug 22 2013 3:08 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
Advertisement