సాక్షి, విజయవాడ : క్రీడాకారులు ఎవ్వరు అధైరపడవద్దు.. ఎవ్వరికి అన్యాయం జరగకుండా చూస్తామని కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన చైర్మన్ కడియాల బుచ్చిబాబు చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గతంలో కబడ్డీ అసోసియేషన్‌లో తలెత్తిన వివాదాల కారణంగా స్వచ్చందంగా జిల్లా అసోసియేషన్‌ను రద్దు చేశామన్నారు. ‘ మే 29న కర్నూలులో ఏపీ కబడ్డీ అసోసియేషన్ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా కృష్ణాజిల్లాకు నూతనంగా హడక్ కమిటీని నియమించారు. నూతన అసోసియేషన్‌కు చైర్మన్‌తో పాటు మరో ఆరుగురిని సభ్యులను ఎంపిక చేశారు. ఇంకా వివాదాలకు తావు లేకుండా అసోసియేషన్‌ను ముందుకు తీసుకువెళ్తాం. కబడ్డీలో కృష్ణా జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని’ బుచ్చిబాబు పేర్కొన్నారు.
‘ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్న అసోసియేషన్ రూమ్‌ను హడక్ కమిటీ స్వాధీనం చేసుకుంటుంది. అసోసియేషన్‌లో ఉన్న విభేదాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.. ఇంకా వారు చూసుకుంటారు. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్న హడక్ కమిటీ దృష్టికి తీసుకురావచ్చని’ కడియాల బుచ్చిబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment