వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట | medals in weight lifting | Sakshi
Sakshi News home page

వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట

Published Thu, Sep 22 2016 9:46 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట

వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట

 ఏలూరు రూరల్‌ : రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారిణులు సత్తా చాటారు. ఈ నెల 20, 21 తేదీల్లో అనంతపురంలో నిర్వహించిన పోటీల్లో వీరు ప్రతిభ చూపారు. ఏలూరు ఈదర సుబ్బమ్మదేవి పాఠశాలకు చెందిన ఎన్‌.సత్యవతి 44 కే జీలు, కె.శివకుమారి 48 కేజీలు, ఎం.దీపనయోమి 53 కేజీల విభాగంలో బంగారు పతకాలు సాధించారు. మరో క్రీడాకారిణి డి.అశ్విని 58 కేజీల విభాగంలో వెండి పతకాన్ని సొంతం చేసుకుంది. బంగారు పతకాలు సాధించిన ముగ్గురు లిఫ్టర్లు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. వచ్చేనెల 3, 4 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొంటారని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు వి.దుర్గరమ, కె.మాధవీలత, వ్యాయామ ఉపాధ్యాయుడు పి.గోపాల్‌ అభినందించారు. విద్యార్థినులను వీరు అభినందించారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement