
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సురేశ్ రైనా చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అడుతున్న విషయం తెలిసిందే. రైనా తన కూతురు గ్రేసియా బర్త్‌డే వేడుకను ఢిల్లీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బ్రావో తదితరులు పాల్గొని సందడి చేశారు. చెన్నై జట్టు ఈ నెల 18న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. ఇందులో భాగంగా ప్లేయర్స్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్‌కు చేరుకున్న విషయం విదితమే. చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి మ్యాచ్ పంజాబ్ జట్టుతో ఆడనుంది.
బంధువులు, సన్నిహితుల మధ్య గ్రేసియా పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. హర్భజన్ సింగ్ తన భార్య గీతా బస్రా కుమార్తె హినయాతో కలిసి వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హాచ్‌చల్ చేస్తున్నాయి. సురేశ్ రైనా ఓ వీడియోను తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. 20 సంవత్సరాల ఉన్న యువతిలా ఆమె యాక్ట్ చేస్తోందని రైనా ట్విట్ పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment