ప్రత్యర్థులను స్నేహితుల్లా భావించాలి | Opponents consider friends | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థులను స్నేహితుల్లా భావించాలి

Published Mon, Aug 1 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

ప్రత్యర్థులను స్నేహితుల్లా భావించాలి

ప్రత్యర్థులను స్నేహితుల్లా భావించాలి

  • 1994లో గోపీచంద్‌తో ఇక్కడికి వచ్చాను..
  • ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్‌ఎం ఆరీఫ్‌
  • ముగిసిన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు
  • వరంగల్‌ స్పోర్ట్స్‌ :  క్రీడాకారులు పోటీల్లో తమ ప్రత్యర్థులను స్నేహితులుగా భావిస్తే ఆడాలని ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్‌.ఎం.ఆరిఫ్‌ సూచిం చారు. వరంగల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో సుబేదారిలోని ఆఫీసర్స్‌ క్లబ్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ అండర్‌–17, 19 బాలబాలికల బ్యాడ్మింటన్‌ పోటీలు ఆదివారం ముగిశాయి.
    ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు ఆరిఫ్‌ హాజరై మాట్లాడారు. 1994లో మొదటిసారి పుల్లెల గోపీచంద్, మనోజ్‌ వంటి అంతర్జాతీయ క్రీడాకారులను జూనియర్స్‌ టోర్నమెంట్‌లో ఆడించేందుకు వరంగల్‌కు వచ్చానని గుర్తు చేసుకున్నారు. పోటీలో విజయం సాధించాలనే తపన, పట్టుదల, శ్రమ ఉంటే అవే లక్ష్య సాదన దిశగా తీసుకువెళ్తాయని తెలి పారు. అలాగే, క్రీడాకారులు ఏకాగ్రత కోసం పుస్తక పఠనం అలవర్చుకోవాలని సూచించా రు. అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి డాక్టర్‌ పింగిళి రమేష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ముగిం పు కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ రెఫరీ వేమూరి సుధాకర్, అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ టి.రవీందర్‌రావు, కోశాధికారి నాగకిషన్, ఆఫీసర్స్‌ క్లబ్‌ కార్యదర్శి గండ్ర సత్యనారాయణరెడ్డి, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా పరిశీలకులు పాణిరావు, ఫణికిషోర్, అంపైర్లు కొమ్ము రాజేందర్, శ్యామ్‌ పాల్గొన్నారు. ఆ తర్వాత విజేతలకు బహుమతులు అందజేశారు.
    విజేతలు వీరే..
    రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో భాగంగా అండర్‌–17 విభాగంలో విజేతల వివరాలిలా ఉన్నాయి. బాలుర సింగిల్స్‌లో పి.విష్ణువర్దన్‌(హైదరాబాద్‌) విజేతగా, ఖమ్మంకు చెందిన టి.పవన్‌కృష్ణ రన్నర్‌గా నిలిచారు. బాలికల విభాగంలో విజేతగా రంగారెడ్డికి చెందిన గాయత్రి గోపీచంద్, హైదరాబాద్‌కు చెందిన సమియా ఇమాద్‌ ఫారూఖీ రన్నర్‌గా, బాలుర డబుల్స్‌లో విన్నర్స్‌గా మెదక్‌కు చెందిన బి.నవనీత్, రంగారెడ్డికి చెందిన పి.శ్రీకృష్ణసాయికుమార్, రన్నర్స్‌గా హైదరాబాద్‌కు చెందిన పి.విష్ణువర్ధన్, ఎం.డీ.ఖదీర్‌ మెుయినొద్దీన్, బాలికల డబుల్స్‌లో విన్నర్స్‌గా రంగారెడ్డికి చెందిన గాయత్రి గోపీచంద్, హైదరాబాద్‌కు చెందిన సమియా ఇమాద్‌ ఫారూఖీ, రన్నర్స్‌గా మెదక్‌కు చెందిన బండి సాహితి, మెదక్‌కు చెందిన జె.శ్రీష్తి నిలిచారు. ఇక అండర్‌–19 బాలుర సింగిల్స్‌ లో ఖమ్మంకు చెందిన ఆదిత్య బాపినీడు విజేతగా, హైదరాబాద్‌కు చెందిన సాయంబోత్రా రన్నర్‌గా, బాలికల సింగిల్స్‌లో రంగారెడ్డికి చెందిన కె.వైష్ణవి విజేతగా, రంగారెడ్డికి చెం దిన గాయత్రి గోపీచంద్‌ రన్నర్‌గా నిలిచారు. బాలుర డబుల్స్‌లో రంగారెడ్డికి చెందిన పి.శ్రీకృష్ణ సాయికుమార్, ఇ.సిద్ధార్థ విజేతలుగా, మెదక్‌కు చెందిన బి.నవనీత్, కిరో తరుణ్‌కుమార్‌ రన్నర్స్‌గా, బాలికల డబుల్స్‌లో మెదక్‌కు చెందిన బండి సాహితి, జె.శ్రీష్టి విజేతలుగా, రన్నర్స్‌గా  హైదరాబాద్‌కు చెందిన రుహిరాజు, ఇషితరాజు నిలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement