ప్రతిభతో క్రీడల్లో గుర్తింపు
ఆదిలాబాద్ స్పోర్ట్స్: క్రీడాకారులోని ప్రతిభతోనే గుర్తింపు లభిస్తుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వివేకానందరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైధానంలో శనివారం టీసీఏ 2డే లీగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఆదిలాబాద్ అర్బన్, ఆసిఫాబాద్ మ్యాచ్‌ల మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదిగేందుకు సాధన అవసరమని, ప్రతిభతోనే గుర్తింపు చేకూరుతుందని చెప్పారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ క్రీడాకారులు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పారు. క్రీడాకారులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. క్రీడానైపుణ్యాలతో అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇందులో టీసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి నరోత్తమ్‌రెడ్డి, జిల్లా జట్టు కోచ్ జయేంద్రపటాస్కర్‌లు , క్రీడాకారులు ఉన్నారు.
ఇంద్రనీల్ అల్‌రౌండర్ ప్రతిభ...
ఆసిపాబాద్ జుట్ట టాస్‌గెలిచి మొదటి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ అర్బన్ జట్టు 359 పరుగులు చేసి 7 వికేట్ల నష్టపోయింది. ఇందులో ఇంద్రనీల్ పటాస్కర్ 156 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. జయగణేష్ 52 పరుగులతో నాటౌట్, అన్వేష్‌రెడ్డి 51 పరుగులు చేసి ఔట్ అయ్యారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆసిఫాబాద్ జట్టు 98 పరుగులు చేసి 9 వికేట్ల నష్టపోయింది. ఇందులో ఇంద్రనీల్ 5 వికేట్లు తీసుకోగా , ప్రణయ్ 2 వికేట్లు తీసుకున్నారు.