
భారత్ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొంటున్న అత్యంత పెద్ద, పిన్న వయస్కులు వీరే

ప్యారిస్ ఒలింపిక్స్ 2024 కోసం భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు.

ఇందులో యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులు కూడా ఎంతో మంది ఉన్నారు.

అయితే, ఈ బృందంలోని అత్యంత పెద్ద, చిన్న వయస్కులైన ఆటగాళ్ల ఏజ్‌లో వ్యత్యాసం ఏకంగా 30 ఏళ్ల కావడం విశేషం

ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ నుంచి పాల్గొంటున్న అత్యంత పెద్ద వయస్కుడు రోహన్ బొపన్న ఈ టెన్నిస్ దిగ్గజం వయసు ప్రస్తుతం 44.

ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో బొపన్న నాలుగవ స్థానంలో ఉన్నాడు.

మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బొపన్న ఇటీవల ఆస్ట్రేలియా మెన్స్ డబుల్స్ 2024 టైటిల్ గెలిచాడు

ఇక ప్యారిస్ ఒలింపిక్స్‌లో బొపన్న పార్ట్‌నర్‌గా ఎన్. శ్రీరాం బాలాజీ వ్యవహరించనున్నాడు.

ఈ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి పాల్గొంటున్న అత్యంత పిన్నవయసు ప్లేయర్ ధినిధి దేశింఘు

14 ఏళ్ల వయసున్న ధినిధి స్విమ్మర్

యూనివర్సిటీ కోటాలో ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఆమె అర్హత సాధించింది

ఆరతి సాహా(హెల్సింకి ఒలింపిక్స్- 1952) తర్వాత ఒలింపిక్స్‌లో భారత్ నుంచి పాల్గొంటున్న పిన్న వయస్కురాలిగా ధినిధి చరిత్ర సృష్టించింది.







